Begin typing your search above and press return to search.

పెళ్లికి రెడీ అంటున్న ట‌బు

By:  Tupaki Desk   |   27 July 2015 8:33 AM GMT
పెళ్లికి రెడీ అంటున్న ట‌బు
X
నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ మ‌త్తెక్కించే అందంతో క‌నిపిస్తుంటుంది ట‌బు. రోజుకో కొత్త అందాన్ని తెర‌పై చూస్తున్నా ట‌బు సినిమా అన‌గానే ఇప్ప‌టికీ కుర్ర‌కారు థియేట‌ర్ల‌కు ప‌రుగెడుతుంటుంది. తొలినాళ్ల‌ లో తెలుగులో స‌త్తా చాటిన ఆమె ఆ త‌ర్వాత హిందీ లోనూ హ‌వా చూపించింది. సెక్సీ పాత్ర‌ల‌ పైనా, న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌పైనా త‌న‌దైన ముద్ర వేసింది. త‌న‌తోటి క‌థానాయిక‌లంతా పెళ్లిళ్లు చేసుకొన్నా... ట‌బు మాత్రం ఇప్ప‌టికీ సింగిల్ లైఫ్‌ నే లీడ్ చేస్తోంది. ఇక ట‌బు పెళ్లి చేసుకోదేమో అని కూడా మాట్లాడుకొంటుంటారు చాలామంది. ఓ తెలుగు హీరో తో ఆమె స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని, ఆమె కోసం స‌ద‌రు హీరో చాలా చేశాడ‌ని ఆమ‌ధ్య చెప్పుకొన్నారు. అందుకే ఆమె పెళ్లి చేసుకోద‌ని కూడా మాట్లాడుకొన్నారు.

ఇటీవ‌ల ట‌బు మాత్రం పెళ్లికి నేను రెడీ అని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచింది. హిందీలో `దృశ్యం` అనే సినిమా చేసింది ట‌బు. దీంతో త‌ర‌చుగా మీడియా లో క‌నిపిస్తోంది. ఇంట‌ర్వ్యూ ల్లో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తోంది. ఆమ‌ధ్య ద‌ర్శ‌కులు నాకు త‌గ్గ పాత్ర‌లు సృష్టించ‌లేక బ‌ద్ద‌కిస్తున్నార‌ని స్టేట్‌ మెంట్ ఇచ్చింది. ఇప్పుడేమో `ఏ క్ష‌ణంలో నైనా నేను పెళ్లి చేసుకోవ‌చ్చు` అని చెప్పుకొచ్చింది. లేటు వ‌య‌సు లో పెళ్లి గురించి చెప్పిందేంట‌బ్బా అని అంతా ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకొంటున్నారు. ``నా పెళ్లి గురించి అంద‌రూ మాట్లాడుకొంటుంటారు. కానీ నేను మాత్రం ఎప్ప‌డూ దాని గురించి సీరియ‌స్‌ గా ఆలోచించ‌లేదు. అలాగ‌ని నేను పెళ్లి చేసుకోన‌ని కాదు. ఎప్పుడు ఏ క్ష‌ణంలో నైనా నా పెళ్లి జ‌ర‌గొచ్చు. ఇల్లు, పెళ్లి, పిల్ల‌లు... ఇలా అంద‌రిలాగే నేనూ ఆలోచిస్తున్నా`` అని చెప్పుకొచ్చింది ట‌బు. లేటు వ‌య‌సులో పెళ్లి గురించి మాట్లాడుతున్న ట‌బు మ‌న‌సులో ఎవ‌రున్నారా? అని ఆరా తీస్తున్నారిప్పుడు.