Begin typing your search above and press return to search.
షాకిస్తున్న సీనియర్ నటి పారితోషికం
By: Tupaki Desk | 13 July 2019 10:19 PM GMTకథానాయికల పారితోషికం అన్ని వేళలా హాట్ టాపిక్. నేటి తరం కథానాయికలు రూ.2-4 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారు. ఒకప్పటి సీనియర్ నాయికలు ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తే వీళ్ల పారితోషికాల రేంజ్ ఎలా ఉంటోంది? అంటే .. వీళ్లేమీ తక్కువ కాదని పలు సందర్భాల్లో రివీలైంది. మధుబాల- నదియా- ఇంద్రజ వంటి భామలకు అప్పట్లో భారీగానే పారితోషికం అందుకున్నారని ప్రచారమైంది.
ప్రస్తుతం మరో సీనియర్ నటి టబు టాలీవుడ్ లో కెరీర్ పరంగా బిజీ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టబు ఇప్పటికే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో టబు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిసింది. మరోవైపు రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న `విరాటఫర్వం` చిత్రంలోనూ టబు ఓ కీరోల్ పోషిస్తున్నారట. వరుసగా తెలుగులో బిజీ అయిపోతున్నారు. ఇంతకీ టబు పారితోషికం ఎంత? అంటే ఒక్కో కమిట్ మెంట్ కి రూ.60లక్షల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తన పాత్ర పరిధి చాలా పెద్దది కాబట్టే అంత పెద్ద మొత్తాల్ని చెల్లించేందుకు నిర్మాతలు అంగీకరిస్తున్నారట.
జాతీయ ఉత్తమ నటిగా టబు పెర్ఫామెన్స్ గురించి ఆలోచించాల్సిన పనేలేదు. నిన్నే పెళ్లాడుతా- ఆవిడా మా ఆవిడే- చాందిని బార్(హిందీ)- సాతియా ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు టబు. ఇటీవలే బాలీవుడ్ లో దేదే ప్యార్ దే- భారత్ చిత్రాల్లోనూ టబు కీలక పాత్రలు పోషించారు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇవ్వడం.. భారీ పారితోషికం అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది.