Begin typing your search above and press return to search.
అఖిల్ 'అమ్మ' చెబుతున్న కబుర్లు
By: Tupaki Desk | 16 July 2017 9:27 AM GMTనాగార్జునకు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించన టబు.. ఇప్పడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న అఖిల్ సెకండ్ మూవీలో నటిస్తోంది. తండ్రికి లవర్ గా నటించి.. కొడుకుకు అమ్మగా నటించడం.. అంటే తండ్రీ కొడుకులు ఇద్దరితోనూ సినిమాల ప్రకారమే రిలేషన్ ను కంటిన్యూ చేస్తూ నటిస్తున్న యాక్ట్రెస్ గా రికార్డ్ సృష్టిస్తోంది టబు.
అయితే.. రియల్ లైఫ్ ఈమె పెళ్లి చేసుకోలేదు. 45 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందామె. ఇన్నేళ్ల కెరీర్ తర్వాత కూడా ఒంటరిగా మిగిలిపోయాననే భావన కలుగుతుందని చెప్పిన టబు.. పెళ్లి చేసుకోలేదని ఏనాడూ బాధ పడలేదని అంటుంది. నచ్చిన వ్యక్తి దొరికితే చేసుకుందామని అనిపించినా.. పాతికేళ్ల వయసులో ఉన్న ఆలోచనలు ఇప్పుడు లేవని అంటోంది. ఒక వేళ ఎవరూ నచ్చకపోతే పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతానని అంటున్న ఆమె.. సినిమాలను తగ్గించుకున్న మాట వాస్తవమే అంటోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేయలేం కదా అన్న ఈ సీనియర్ బ్యూటీ.. తన కెరీర్ ఇంతగా కొనసాగడానికి కోస్టార్స్.. తనకు ఆఫర్స్ ఇచ్చిన వాళ్లే కారణమని.. అంతా తన ప్రతిభే అని తాను చెప్పనని అంటోంది.
తనకు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు దక్షిణాదివే అంటున్న టబు.. తనపై అమ్మ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అఖిల్ కి అమ్మగా నటిస్తున్నా.. ఆ సినిమా గురించి డీటైల్స్ చెప్పబోనని తేల్చేసింది. స్టోరీ.. రోల్ నచ్చితే.. చిన్న పాత్ర అయినా.. ఎలాంటి రోల్ అయినా చేస్తానని తెలిపింది టబు. సౌత్ లో ఓ స్టార్ తో తనకు రిలేషన్ అంటగట్టడంపై మాత్రం చాలా ఎక్కువగా బాధపడేదిట టబు.