Begin typing your search above and press return to search.
`తడప్` ట్రైలర్ పై మెగాస్టార్ కామెంట్!
By: Tupaki Desk | 27 Oct 2021 3:30 PM GMTటాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఆర్ ఎక్స్ -100` బాలీవుడ్ లో `తడప్` టైటిల్ తో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి ఈ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. తారా సుతారియా హీరోయిన్ గా నటిస్తోంది. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి రీమేక్ కావడంతో బాలీవుడ్ లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యాక్షన్.. రొమాన్స్ లవ్ అంశాలను పీక్స్ లో ఎలివేట్ చేసారు.
బాలీవుడ్ స్టైల్లో రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే వర్కవుట్ చేసినట్టు కనిపిస్తోంది. కథలో చాలా మార్పులు చేశారని అర్థమవుతోంది. ట్రైలర్ ఆద్యంతం హీరో పాత్రను ఎక్కువగా హైలైట్ చేసారు. హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు గొప్పగానే పండాయి. విజువల్స్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్నాయి. ప్రీతమ్ సంగీతం సినిమాకు ప్రధాన అస్సెట్. ఈ సినిమా ట్రైలర్ ఉద్దేశించి బిగ్ బి ఆసక్తికర కామెంట్ ని పోస్ట్ చేశారు. ఆహాన్ నువ్వు ఎదగడం నేను చూసాను. ఈరోజు మొదటి ప్రయత్నం ద్వారా సినీ ప్రపంచానికి నిన్ను పరిచయం చేయడం సంతోషంగా.. గౌరవంగా ఉంది. `తడప్` చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అని అన్నారు.
ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. `రా అండ్ ఇంటెన్స్` ట్రైలర్ అదిరిపోయింది. ఇంప్రెస్సివ్ గా అనిపిస్తుంది. ఆహాన్ శెట్టికి మంచి విజయం దక్కాలి`` అని చిరంజీవి ఆకాంక్షించారు. ఆహాన్ కి అటు బాలీవుడ్ నుంచి..ఇటు టాలీవుడ్ నుంచి ఇద్దరు లెజెండరీలు విషెష్ చెప్పడం విశేషం. ఇక సునీల్ శెట్టి ఇటీవల టాలీవుడ్ కోలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసినదే. బిగ్ బీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో సోషలో మీడియాలో జోరుగా దూసుకుపోతుంది. ట్రైలర్ కి సోషల్ మీడియా జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. డిసెంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. `తడప్` అంటే `తపన` అని అర్ధం.