Begin typing your search above and press return to search.
ఇడిగిడిగో వచ్చాడు.. మెగా సుప్రీమ్ స్టార్
By: Tupaki Desk | 18 March 2015 6:34 AM GMTమెగా హీరోలు టాలీవుడ్‌ని ఏల్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ ఫ్యామిలీనుంచి వస్తున్న ప్రతి హీరో స్వయం కృషితో తమని తాము ఆవిష్కరించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఆ పయనం అరడజను హీరోల వరకూ పెరిగింది. అన్న చిరంజీవిలానే పవన్‌కల్యాణ్ పవర్‌స్టార్ అన్న బిరుదుకు సార్థకనామధేయుడు అనిపించుకున్నాడు.
ఆ తర్వాతి జనరేషన్‌లో చిరు తనయుడు చరణ్ మెగా పవర్‌స్టార్ అనిపించుకున్నాడు. అల్లు అర్జున్ స్టయిలిష్ స్టార్‌గా స్థిరపడ్డాడు. అయితే అదే కుటుంబంలో ఆ తర్వాతి జనరేషన్‌లో సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్ ఆరంగేట్రం చేశారు. ఈ ఇద్దరికీ అప్పుడే బిరుదులు కూడా వచ్చేశాయి. సాయిధరమ్‌ని మెగా సుప్రీమ్ హీరో అని పిలిచేస్తున్నారు. ఇటీవలే ఓ వేదికపై సాయిధరమ్ దర్శకుడు వైవియస్ ఇలా పిలిచి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మెగాస్టార్+సుప్రీంహీరో రెండిటినీ కలిపేసి ఇలా పిలిచాడు.
అలాగే వరుణ్‌తేజ్‌ని మెగా ప్రిన్స్ అని పిలుచుకుంటున్నారు అభిమానులు. ఏదేమైనా జనరేషన్ మారే కొద్దీ ఈ బిరుదుల పొడవు పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం ఒకటి రెండు పదాలకే పరిమితమైన బిరుదు కాస్తా ఇప్పుడు నాలుగైదు పదాలు పడితే కానీ నిలబడలేకపోతోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా హీరోలు పెరిగే కొద్దీ ఎలాంటి క్యూ పెరుగుతుందో మరి!!