Begin typing your search above and press return to search.

`కాంచ‌న 3` తెలుగు రైట్స్‌ ఆయ‌న‌కే!

By:  Tupaki Desk   |   10 March 2019 4:51 AM GMT
`కాంచ‌న 3` తెలుగు రైట్స్‌ ఆయ‌న‌కే!
X
హార‌ర్ కామెడీ.. థ్రిల్ల‌ర్ జోన‌ర్ ని తెరకెక్కించ‌డంలో లారెన్స్ మాస్టార్ ప‌నిత‌నం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. `కాంచ‌న`(ముని) సిరీస్ లో బంప‌ర్ హిట్లు కొట్టిన ఘ‌నుడాయ‌న‌. అందుకే అదే ఫ్రాంఛైజీ నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది అంటే అంద‌రిలోనూ క్యూరియాసిటీ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈసారి రాఘ‌వ లారెన్స్ మాస్టార్ ఎలాంటి ప్ర‌యోగం చేయ‌బోతున్నారు? హార‌ర్ థ్రిల్ల‌ర్‌ తో మ‌రోసారి బాక్సాఫీస్ క‌ల‌శాన్ని కొల్ల‌గొట్ట‌బోతున్నాడా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే ముని, కాంచ‌న, కాంచ‌న 2 (గంగ‌) చిత్రాలు బంప‌ర్ హిట్లు అయ్యాయి. ఈ వ‌రుస‌లోనే `కాంచ‌న 3` తెలుగు -త‌మిళ ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధం చేసేందుకు వ‌స్తోంది. ఈ సినిమా హార‌ర్ థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో ఉంటూనే భారీ యాక్ష‌న్ తో అల‌రించ‌బోతోంద‌ట‌. అంతేకాదు.. కాంచ‌న 2 (గంగ‌) చిత్రంలో నిత్యామీన‌న్ ఫిజిక‌ల్ హ్యాండికేప్డ్ పాత్ర‌తో ఇచ్చిన స‌ర్ ప్రైజ్ ని మ‌న జ‌నం అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అలాంటి ట్విస్టు ఈసారి కూడా కాంచ‌న 3లో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతోంద‌ట‌.

ఈ సినిమాని తెలుగులో ఎవ‌రు రిలీజ్ చేస్తున్నారు? అంటే .. విశాల్ హీరోగా `పందెంకోడి 2` చిత్రాన్ని నిర్మించిన ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. 11కోట్ల‌కు కాంచ‌న 3 హ‌క్కుల్ని కొనుక్కున్నారట‌. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ చేయాల‌ని భావించినా కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల మేలో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా త‌ర‌హాలో భారీగా రిలీజ్ చేసేందుకు ఠాగూర్ మ‌ధు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. లారెన్స్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేం ఓవియా వేడెక్కించే పాత్ర‌లో న‌టిస్తోంది. వేదిక ఓ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అప్‌క‌మ్ బ్యూటీ నిఖిత వేరొక హీరోయిన్‌గా న‌టిస్తోంది.