Begin typing your search above and press return to search.

సుశాంత్ ఫ్యామిలీ అనుమ‌తి లేనిదే బ‌యోపిక్ తీయ‌లేరు

By:  Tupaki Desk   |   10 Oct 2020 7:30 AM GMT
సుశాంత్ ఫ్యామిలీ అనుమ‌తి లేనిదే బ‌యోపిక్ తీయ‌లేరు
X
దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవిత‌క‌థ‌ను వెండితెర‌‌కెక్కించేందుకు ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉబ‌లాటప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే బ‌యోపిక్ తెర‌కెక్కించాలంటే అందుకు ముందుగా సుశాంత్ కుటుంబీకుల అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత‌నే హ‌క్కు ఉన్న‌ట్టు అన్న చ‌ర్చ తెర‌పైకొచ్చింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌యోపిక్ ని త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్న ఓ ఇద్దరు నిర్మాతల మధ్య చట్టపరమైన వివాదం రాజుకోవ‌డంతో తాజా అంశం హాట్ టాపిక్ గా మారింది. సినిమా తీయాల‌న్నా లేదా పుస్త‌కం రాయాల‌న్నా... దానికి దివంగ‌త న‌టుడితో అనుసంధానించబడిన అన్ని సృజనాత్మక వనరులను అత‌డి కుటుంబం నుంచి మాత్రమే పొందాల్సి ఉంటుంది. అందుకు అన్ని హ‌క్కులు ఆ కుటుంబీకుల‌కే ద‌ఖ‌లు ప‌డ్డాయి.

దీని అర్థం.... ఎవరైనా సినిమా తీసేటప్పుడు లేదా సుశాంత్ గురించి పుస్తకం రాసేటప్పుడు సింగ్ పరివార్ నుండి పూర్తిగా తుది సమ్మతి పొందవలసి ఉంటుంది. అలాగే నటుడి జీవితాన్ని తెర‌పై చూపించేయాల‌ని లేదా పుస్త‌కంలో రాసేయాల‌ని ప్రయత్నించడం చాలా తొందర పాటు చ‌ర్య అవుతుంది. అతని జీవిత కథకు ఇంకా ముగింపు లేదు. ఇంత‌కీ సుశాంత్ సింగ్ ని హ‌త్య చేశారా? లేక ఆత్మ‌హ‌త్య‌తోనే మ‌ర‌ణించాడా? ఈ మ‌ర‌ణంతో ముడిప‌డి ఉన్న డ్ర‌గ్స్ దందా సంగ‌తేమిటి? అన్న‌దానికి సీబీఐ-ఎన్.సి.బి ఫైన‌ల్ రిపోర్ట్ ను ఇవ్వ‌లేదు. అందువ‌ల్ల బ‌యోపిక్ తీస్తామంటూ తొంద‌ర‌ప‌డితే కోర్టు వివాదాలు త‌ప్ప‌వ‌ని విశ్లేషిస్తున్నారు.