Begin typing your search above and press return to search.
25 ఎకరాల్లో డ్యాన్సర్స్ కాలనీ
By: Tupaki Desk | 7 May 2019 4:26 AM GMTటాలీవుడ్ కి మంచి రోజులొచ్చాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. సక్సెస్ రేటు పెరుగుతోంది. పైగా సినిమా 24 శాఖలు ఒక్కొక్కటిగా బలోపేతం అవుతున్నాయి. మూవీ ఆర్టిస్టుల సంఘం.. దర్శకసంఘం ఇప్పటికే నిధి సేకరణ కార్యక్రమాలకు తెరలేపి సొంత భవంతుల నిర్మాణానికి కార్యాచరణను సిద్ధం చేశాయి. సభ్యుల సంక్షేమానికి అవసరమయ్యే నిధిని సేకరించే ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే ఇన్సూరెన్సులు.. పెన్షన్లు అంటూ రకరకాల ప్లాన్స్ కి తెరలేపడం అందరిలో ఉత్సాహం కనిపిస్తోంది.
మా అసోసియేషన్ .. డైరెక్టర్స్ అసోసియేషన్ యాక్టివిటీస్ ఇతరత్రా శాఖల్ని మేల్కొలుపుతున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే వీళ్లందరికంటే ముందుగానే సొంత భవంతి ప్రారంభోత్సవం చేసి డ్యాన్సర్స్ అసోసియేషన్ బిగ్ షాకివ్వడం చర్చకొచ్చింది. సైలెంటుగా నిన్నటిరోజున తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సొంత భవంతిని ప్రారంభించారు. అంతేకాదు.. హైదరాబాద్ - శంకరపల్లిలో 25 ఎకరాల్లో డ్యాన్సర్ల కోసం స్థలం కేటాయిస్తున్నామని ప్రకటించారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటనతో డ్యాన్సర్స్ అసోసియేషన్ సంబరాలు చేసుకున్నారు.
టీఎఫ్ టీడీడీఏ నూతన భవన ప్రారంభోత్సవం అనంతరం తలసాని మాట్లాడుతూ -``ఐకమత్యమే కార్మికుల బలం. సినిమా మీద ఇష్టంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నారు. ఇంతే సహనం ఒక సంఘంలో ఉన్నప్పుడు చూపించాలి. సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా సినీ కార్మికులకు సహకారం అందిస్తోంది. ఎనిమిది నెలల్లో నూతన భవనం నిర్మించుకున్న డాన్సర్స్ సంఘానికి నా శుభాకాంక్షలు. నా వంతుగా ఐదు లక్షల రూపాయలు అందజేశాను. పరిశ్రమను నమ్ముకున్న మీరంతా జీవితాల్లో స్థిరపడాలి. నూతన భవన నిర్మాణంలో అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కృషి ఎంతో ఉంది`` అన్నారు. కార్యక్రమంలో టీఎఫ్ టీడీడీఏ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యువ నాయకులు నవీన్ యాదవ్ - సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు కొమర వెంకటేష్ - ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ - మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్.. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ - సీనియర్ నృత్య దర్శకులు శివశంకర్ మాస్టర్ - స్వర్ణ మాస్టర్.. ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.