Begin typing your search above and press return to search.
మరో ఆర్నెళ్లు సీసీసీ-తలసాని ట్రస్ట్ సాయం?
By: Tupaki Desk | 27 May 2020 5:00 AM GMT60రోజులుగా లాక్ డౌన్ కార్మికుల జీవితాల్ని రోడ్డున పడేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వినోదపరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ముఖ్యంగా టాలీవుడ్ లో వేలాది మంది సంఘటిత అసంఘటిత సినీ కార్మికులు తిండికి లేక ఇబ్బంది పడుతున్నారన్న గణాంకాల్ని ఇటీవల సినీపెద్దలు గుర్తించారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరుతో సినీకార్మికులకు నిత్యావసరాల సాయం చేసిన సంగతి తెలిసిందే. సీసీసీ సాయంపై పరిశ్రమ వర్గాలు సహా అన్ని వర్గాలనుంచి ప్రశంసలు కురిసాయి.
ఇదే కోవలో సినీ-టీవీ కార్మికుల సాయం కోసం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముందుకొచ్చారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సాయం అందించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. ఈ సేవా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మహమ్మారీ ప్రభావం ఇతర రంగాలతో పోలిస్తే సినీ రంగంపైనే అధికంగా పడింది. టాలీవుడ్ లో డెయిలీ వేజెస్ కార్మికులకు జీత భత్యాలు లేక అల్లాడుతున్నారు. అవసరం మేర పెద్దల సలహాలు సూచనలు తీసుకుని తనకు తానుగానే ఈ సేవాకార్యక్రమానికి తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. గురువారం మొదలు నిత్యం 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగనుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం.. దాదాపు 70లక్షల నిధితో 12 వేల మంది ఫిలిం టెక్నీషియన్లకు.. 2000 మంది టీవీ టెక్నీషియన్లకు కలుపుకుని మొత్తం 14 వేల మంది సినీకార్మికులకు సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు తలసాని. తొలుత రోజువారీ భత్యంపై బతికే కార్మికులకు ఈ సాయం అందించనున్నారు. దీనికోసం అన్ని అసోసియేషన్లకు సరుకుల్ని పంపిస్తారని తెలిసింది. జూన్ 10 తర్వాత తిరిగి సీసీసీ తరపున నిత్యావసరాల పంపిణీని ప్లాన్ చేయనున్నారని తెలుస్తోంది. ఓవైపు చిరంజీవి సీసీసీ సాయం.. మరోవైపు తలసాని ట్రస్ట్ సాయం కార్మికుల్ని ఆదుకోనుందని హర్షం వ్యక్తమవుతోంది. అయితే మహమ్మారీ కష్ట కాలం ఈ రెండు నెలలేనా? మరో ఆరు నెలలు.. సంవత్సరం పాటు ఇలానే ఉంటే పరిస్థితి ఏమిటి? అంతవరకూ సీసీసీ - తలసాని ట్రస్ట్ ఆదుకుంటాయా? అన్న చర్చా ప్రస్తుతం సినీవర్గాల్లో సాగుతోంది.