Begin typing your search above and press return to search.
అవార్డుల పండుగకు తెలంగాణ ప్రభుత్వం రెడీ
By: Tupaki Desk | 22 Jan 2017 5:43 AM GMTతెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సినిమాలకు.. టీవీలకు ప్రత్యేకంగా అవార్డుల పండుగ నిర్వహించాలనే ఆలోచన ఉన్నా.. ఇప్పటి వరకూ కార్యరూపం రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఆలోచనలకు ఓ రూపం వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పటి నుంచి నంది అవార్డు పండుగ ఆగిపోయిన సంగతి తెలిసిందే.
నంది అవార్డులకు బదులుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త అవార్డులను నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ గట్టి ప్రయత్నాలే చేసింది. అటు సినిమాలతో పాటు.. ఇటు టీవీ అవార్డులను కూడా కలిపి నిర్వహించడంపై తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో తెలుగు సంవత్సరాదికి ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ కాగా.. ఈ ఏడాది నుంచి దసరా పండుగకు ప్రభుత్వం నిర్వహించే అవార్డుల వేడుక నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఇందుకోసం.. నెమలి.. పాలపిట్ట.. సింహం.. కాకతీయ తోరణం..లను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వీటిలో ఏదో ఒకదాన్ని తుది ఎంపిక చేస్తారట. అలాగే ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ పేరుతో డిసెంబర్ 1 నుంచి 4 వరకూ వేడుకలు నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. 100 దేశాల నుంచి ఈ కార్యక్రమానికి ప్రతినిధులు హాజరవుతారని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/