Begin typing your search above and press return to search.
బ్యాక్ గ్రౌండ్ తో పనేంటి? ట్యాలెంట్ ముఖ్యం!
By: Tupaki Desk | 17 Aug 2019 9:51 AM GMTపరిశ్రమ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు కం ఎగ్జిబిటర్ దిల్ రాజు ఆల్ రౌండర్ నైపుణ్యం గురించి తెలిసిందే. ఒక సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకూ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఏ సినిమా హిట్టవుతుంది? ఏది హిట్టు కాదు? అనేది ఆయన చెప్పగలరు. ఇండస్ట్రీలో బెస్ట్ జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా ఆయనకు ఐడెంటిటీ ఉంది. రాజుగారు చెబితే అది హిట్టేనని అంతా నమ్ముతారు. అయితే అలాంటి ఆయన తనకు జడ్జిమెంట్ తెలియదని అనేశారు. అయితే ఎందులో తెలీదు? అంటే..
యంగ్ హీరో శేష్ ఎంపిక చేసుకుంటున్న కథలను ఎలా జడ్జి చేయాలో తనకు తెలియదని అన్నారు. అలాంటి థ్రిల్లర్ మోడ్ కథాంశాల్ని తాను జడ్జ్ చేయలేనని అది కేవలం శేష్ మాత్రమే చేయగలడని కితాబిచ్చారు. ఎవరు చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసిన దిల్ రాజు ఈ చిత్రం విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. తాజా సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ శేష్ లోని జడ్జిమెంట్ ని కొనియాడారు. ఒక సాధాసీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ `క్షణం` చిత్రంతో హీరో అయ్యారు. ఆ కథను ఎంచుకోవడంలో జడ్జిమెంట్ ఫలించింది. ఆ తర్వాత గూఢచారితో పెద్ద హిట్టు కొట్టారు. ఇప్పుడు ఎవరు తో మరోసారి విజయం అందుకున్నాడు. అసలు పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేదని చాలా మంది అంటుంటారు. మమ్మల్ని సాయం చేయమని అడుగుతారు. కానీ అసలు ఆ మాట అనాల్సిన పనేలేదని శేష్ నిరూపించాడు! అంటూ దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే రాజుగారు అంతటి వారు నిజాయితీగా ఉన్న విషయాల్ని మాట్లాడడం ఆసక్తిని కలిగించింది. తనకు జడ్జిమెంట్ ఏ విషయంలో లేదో చెప్పిన రాజుగారు బ్యాక్ గ్రౌండ్ కంటే ట్యాలెంటును నమ్ముకుని రమ్మని యువతరానికి సూచించారు. శేష్ లాంటి అరుదైన ప్రతిభావంతులు ఇంకా ఎందరో ఉన్నారు. కానీ వీళ్లంతా తమకు బ్యాక్ గ్రౌండ్ లేదని సంకోచిస్తుంటారు. ఇటీవల బ్యాక్ గ్రౌండ్ తో పనే లేకుండా ప్రయత్నించి సఫలమయ్యేవాళ్లు బయటపడుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అందుకుంటున్న హీరోల జాబితా కూడా ఇటీవల అంతకంతకు పెరుగుతోంది.