Begin typing your search above and press return to search.

‘రష్మీ రాకెట్’ కోసం చెమట చిందిస్తున్న తాప్సీ!

By:  Tupaki Desk   |   20 Dec 2020 5:30 PM GMT
‘రష్మీ రాకెట్’ కోసం చెమట చిందిస్తున్న తాప్సీ!
X
తన అప్ కమింగ్ మూవీ ‘రష్మీ రాకెట్’ కోసం చెమట చిందిస్తోంది తాప్సీ పన్నూ. గతంలో ఎన్నడూ చేయని ఫీట్స్ ఈ చిత్రం కోసం చేస్తోంది. ఈ క్రమంలో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత మళ్లీ తన కసరత్తులు మొదలు పెట్టింది.

‘రష్మీ రాకెట్’ చిత్రంలో అథ్లెట్ రష్మీ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఈ పాత్ర కోసం అథ్లెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో వేరికో వెయిన్స్ సమస్య ఎదురుకావడంతో చికిత్స తీసుకుంది. 6 వారాల క్రితం జరిగిన ఈ చికిత్స అనంతరం తాజాగా.. మళ్లీ శిక్షణ మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

“నేను ఈ శిక్షణ ప్రారంభించడానికి 6 నెలల ముందు నా పాదాలకు వేరికో వెయిన్స్ చికిత్స జరిగింది. ఆ చికిత్స తాలూకు మచ్చలు చూడ్డానికి ఇబ్బందిగా ఉన్నాయి’’ అని ఆ చిత్రానికి క్యాప్షన్ యాడ్ చేసింది. రక్తం సరఫరా చేసే సిరలు ఉబ్బి పోవడంతో ఈ వేరికో వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కొని కూడా శిక్షణ కొనసాగిస్తోంది తాప్సీ. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.