Begin typing your search above and press return to search.
ఫన్నీ స్కైలాబ్ ఎక్కించబోతున్న ట్యాలెంటెడ్ హీరో హీరోయిన్
By: Tupaki Desk | 12 July 2021 7:50 AM GMTఇటీవల కాలంలో సత్యదేవ్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నాయి. కొన్ని ఓటీటీ వద్ద విడుదల అవ్వగా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. మొత్తంగా ఈయన సినిమాలు ఇటీవల కాలంలో మంచి టాక్ ను దక్కించుకుంటున్న నేపథ్యంలో ఈయన నటిస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ప్రతి సినిమాను విభిన్నమైన కథతో చేసేందుకు సత్యదేవ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం స్కైలాబ్. ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
స్కైలాబ్ పడ్డ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో పాటు చక్కని వినోదాన్ని అందించేందుకు గాను దర్శకుడు విశ్వక్ ఖండేరావు రూపొందిస్తున్నాడు. స్కైలాబ్ సినిమా లో సత్యదేవ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం వల్ల సినిమా పై క్రేజ్ మరింతగా పెరుగుతోంది. తెలుగు లో వీరిద్దరికి మంచి పేరుంది. ఇద్దరు కూడా ట్యాలెంటెడ్ స్టార్స్ గా గుర్తింపు దక్కించుకున్నారు. వరుస సినిమాలు చేస్తున్న సత్యదేవ్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. కాని స్కైలాబ్ మాత్రం వాటిలో చాలా ప్రత్యేకంగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
1979 లో స్కైలాబ్ ఘటన జరిగింది. ఆ సమయంలో చాలా మంది చాలా రకాలుగా భయాలు పెంచుకున్నారు. అప్పుడు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఫన్నీ స్క్రీన్ ప్లేతో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రీకరించి చూపించబోతున్న చిత్రమే ఇది. సత్యదేవ్ పలు సీరియస్ సినిమాలు ఇప్పటి వరకు చేశాడు. కాని మొదటి సారి సీరియస్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. స్కైలాబ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఫన్నీగా ఏదో ప్రత్యేకంగా సినిమాలో చూపించబోతున్నారు అనిపించేలా ఉందంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.