Begin typing your search above and press return to search.
'హిట్ 3' కోసం ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్?
By: Tupaki Desk | 14 Dec 2022 2:30 AM GMTఅడివి శేష్ ఇప్పుడు మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ HIT 2 తో విజయం అందుకున్నాడు. శైలేష్ కొలను ఈ సీక్వెల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడంతో దర్శకుడు శైలేష్ కొలను ఫుల్ జోష్ తో ఉన్నారు. హిట్ 3 కోసం ఇప్పటి నుంచే తన ప్రణాళికల్ని రివీల్ చేస్తున్నాడు. తాజాగా అతడు ఒక ఫన్నీ మీమ్ ని షేర్ చేసి తన తదుపరి వెంచర్ హిట్ 3 కోసం అనిరుధ్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాల్సిందేనా? అంటూ అభిమానులను అడిగాడు.
వెంకీ చిత్రంలోని ఒక ఫన్నీ మీమ్ ని షేర్ చేసి అనిరుధ్ రవిచంద్రన్ మాత్రమే హిట్ 3 కి సంగీత దర్శకుడిగా కావాలని ప్రజలు అభిమానులు కోరుతున్నారని కొంతకాలంగా ఈ మీమ్ ని సోషల్ మీడియాలో తాను చూస్తున్నానని అన్నారు. మొత్తానికి శైలేష్- అనిరుధ్ కాంబినేషన్ లో హిట్ ఫ్రాంఛైజీ నుంచి మూడో భాగం తెరకెక్కనుందని క్లారిటీ వచ్చేసినట్టే.
పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' సహా పలు విజయవంతమైన చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. హిట్ 2 చిత్రానికి జాన్ స్టివార్ట్- సురేష్ బొబ్బిలి-ఎం.ఎం.శ్రీలేఖ సంయుక్తంగా సంగీతం అందించారు. హిట్ 3 కోసం అనిరుధ్ ని బరిలో దించే ఛాన్సుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శైలేష్ కొలను హిట్ 3 గురించి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో విశ్వక్ సేన్ పోషించిన రుద్రరాజుకి సంబంధించిన కథాంశం రాసుకున్నా కానీ 'హిట్ 2' కథ వేరేగా మారిందని కథాంశం ఆధారంగా ఆర్టిస్టులను ఎంచుకున్నానని తెలిపారు.
క్లైమాక్స్ భాగాన్ని రాసేటప్పుడు హిట్ 2లో అడివి శేష్ సరిపోతాడని భావించానని కూడా తెలిపాడు. శేష్ కి నా కథనం నచ్చడంతో ఓకే చెప్పాడు. ఆఫీసర్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. నేను శేష్ పాత్రకు కొంచెం వ్యంగ్యాన్ని జోడించాను... అది బాగా వర్కవుటైందని అన్నారు. శేష్ ని కొత్త అవతార్ లో ప్రదర్శించగలనని నమ్మాను అని తెలిపారు. హిట్ 2 ఘనవిజయంతో ఇప్పుడు హిట్ 3లో శేష్ నటిస్తారని భావించవచ్చు.
మీరు ఫ్రాంచైజీని ఎలా ప్లాన్ చేసారు? అన్న ప్రశ్నకు శైలేష్ జవాబిచ్చారు. ముందుగా ఓ కొత్త అధికారిని పరిచయం చేసి వారి కథను చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు నా మనసు మార్చుకుని ఎవెంజర్స్ లాగానే ఆఫీసర్లందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని అనుకున్నాను. అదే విషయాన్ని విశ్వక్ సేన్ కి చెప్పాను. దానికి ఆయన అంగీకరించారు. విశ్వక్ మునుముందు హిట్ ఫ్రాంఛైజీ చిత్రాలలో కూడా కనిపించనున్నాడు.. అని తెలిపారు. హిట్ 2 లో నాని సర్ ప్రైజింగ్ రోల్ హిట్ 3లోను కొనసాగింపుగా వస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.