Begin typing your search above and press return to search.
ట్యాలెంటెడ్ యువనిర్మాత 100కోట్ల బిజినెస్
By: Tupaki Desk | 7 July 2021 4:30 AM GMTఓవైపు నిర్మాతగా మరోవైపు పంపిణీదారుగా ప్రణాళికా బద్ధంగా బిజినెస్ ని నడిపిస్తూ విజయం సాధించడం అంటే ఆషామాషీ కాదు. ఏదైనా సినిమాకి స్టోరి కంటెంట్ ని నిర్ణయించడం.. దర్శకులను ఫైనల్ చేయడం వగైరా వగైరా విషయాల్లో రాణించాలంటే దానికి ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం అవసరం. అలాంటి అనుభవం ఉన్న ప్రతిభావంతుడు గనుకనే బన్ని వాస్ ప్రస్తుతం వంద కోట్ల బిజినెస్ కి సన్నాహాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆయన ఓవైపు ఇతర బ్యానర్ల టై అప్ లతో మీడియం బడ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. యువి సంస్థలో స్నేహితులతో కలిసి ఇప్పటికే పలు చిత్రాల్ని నిర్మిస్తున్న బన్ని వాస్ తదుపరి `నాన్ థియేట్రికల్ రైట్స్` బిజినెస్ పైనా తెలివిగా పెట్టుబడులు పెడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన వరుణ్ తేజ్ నటిస్తున్న గని మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ని 20కోట్లకు ఛేజిక్కించుకున్నారని తెలుస్తోంది. డిజిటల్- శాటిలైట్ - హిందీ డబ్బింగ్ హక్కులను గంపగుత్తగా అతడు దక్కించుకున్నారు. వీటికి సంబంధించిన బేరసారాలకు అతడినే ట్రేడ్ వర్గాలు సంప్రదించాల్సి ఉంటుందని సమాచారం. ఏడాది కాలంగా బన్ని వాస్ ఈ తరహా వ్యాపారంలో రాణిస్తున్నారని తెలిసింది. గని బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. వరుణ్ తేజ్ భారీగా కండలు పెంచి పూర్తి మేకోవర్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు.
బన్ని వాస్ సారథ్యంలోని జీఏ2 సంస్థ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో `పక్కా కమర్షియల్` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. తదుపరి వరుసగా కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేస్తున్నారని సమాచారం. అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ .. నిఖిల్ హీరోగా 18 పేజెస్ లాంటి క్రేజీ చిత్రాల్ని జీఏ 2 సంస్థ భాగస్వాములతో కలిసి నిర్మిస్తోంది. వీటన్నిటి కోసం బన్ని వాస్ భారీగా పెట్టుబడుల్ని సమకూర్చారు.