Begin typing your search above and press return to search.
సినీ కార్మికులకు తీపి కబురు.. వేతనాలు పెంచేస్తూ నిర్ణయం
By: Tupaki Desk | 15 Sep 2022 4:33 AM GMTకరోనా.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ఓటీటీ ఎదురుదెబ్బలతో నిత్యం ఉరుకులు పరుగులు తీస్తున్న చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో నిర్మాతల మండలి వరుస భేటీలు నిర్వహిస్తూ.. హీరో.. హీరోయిన్ల రెమ్యునరేషన్లకు కొత్త పరిమితులు పెట్టటమే కాదు.. వారి గొంతెమ్మ కోరికలకు ఒక లిమిట్ దాటకుండా జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు పడటం తెలిసిందే.
చిత్ర నిర్మాత సైతం కాస్తంత ఊపిరి పీల్చుకునేలా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఖర్చుల్ని కిందకు తగ్గించేలా వరుస నిర్ణయాల్ని వెల్లడిస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమ.
తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందిస్తూ.. సినీ కార్మికుల వేతనాల్ని 30 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
రెండు నెలలుగా సినీ కార్మికులు ఏవైతే డిమాండ్లుగా పేర్కొంటూ ఆందోళన చేస్తున్నారో.. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా ఓకే చేస్తున్న పరిస్థితి. అంతేకాదు.. ఫిలిం ఫెడరేషన్ నేతలతో జరిగిన చర్చలు ఫలవంతంగా సాగటమే కాదు.. వెంటనే పనిలోకి దిగేందుకు వీలుగా తాజా నిర్ణయాలు ఉన్నాయి.
అయితే.. ఈ నిర్ణయాన్నిమరో రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే.. ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి వస్తుంది. కరోనా కారణంగా నిర్మాతలు వేతనాల్ని పెంచలేదు. తాజా ఆందోళన నేపథ్యంలో వేతనాల్ని పెంచేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.
వేతనాలకు సంబందించి కమిటీ ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకొని 30 శాతం పెంపునకు ఓకే చెప్పేశారు. ఇప్పుడు అందరి వెయిటింగ్.. చేతికి రావాల్సిన అధికార ప్రకటన కోసమేనని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.