Begin typing your search above and press return to search.
#టాక్ ఆఫ్ ది ముంబై.. బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్!
By: Tupaki Desk | 19 Dec 2021 8:23 AM GMTపాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` ప్రీరిలీజ్ వేడుకకు ముంబై ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ముంబైలో భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తొలిసారి తెలుగు సినిమా వేడుక ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ టీమ్ అంతా ముంబై చేరుకుంది. మెయిన్ క్రూ సహా చిన్నా చితకా ఆర్టిస్టులు అంతా వేడుకలో పాల్గొంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్..దర్శకుడు రాజమౌళి..సంగీత దర్శకుడు కీరవాణి సహా టీమ్ అంతా హాజరవుతున్నారు. తాజాగా చరణ్..తారక్ కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ఇందులో చరణ్..తారక్ ప్రీ రిలీజ్ వేడుకకు ముస్తాబుతున్న స్టేజ్ బ్యాక్ సైడ్ కూల్ గా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఈ పిక్ ని ఉద్దేశించి `బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్` అంటూ యూనిట్ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అలాగే `రోర్ ఆఫ్ `ఆర్.ఆర్.ఆర్ ఇన్ ముంబై` అని రాసుకొచ్చారు. తారక్ బ్లూ రౌండ్ నెక్ టీ షర్టు జీన్స్ ధరించగా... వైట్ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్...కార్గో జీన్స్ ధరించి చరణ్ కనిపిస్తున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. `ఆర్.ఆర్.ఆర్` స్టార్స్ ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటోన్న పిక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ముంబై వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి.
తారక్ కి తొలి హిందీ చిత్రమిది. చరణ్ ఇప్పటికే `జంజీర్` రీమేక్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. దీంతో చరణ్ కి అక్కడ స్టార్ గా ఎదిగే ఛాన్స్ దక్కలేదు. మెగాస్టార్ తనయుడిగా మాత్రమే అక్కడ ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో చరణ్..తారక్ కి `ఆర్ ఆర్ ఆర్` ద్వారా హిందీ మార్కెట్ కీలకం కాబట్టి రాజమౌళి ఈవెంట్ ని అక్కడ గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. ఇక `బాహుబలి` సక్సెస్ తో జక్కన్న పాన్ ఇండియా దర్శకుడిగా వెలిగిపోతున్నారు. అతనికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తోనే ఉత్తరాదిన సినిమాకి పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది. ఆ నమ్మకాన్ని జక్కన్న నిలబెట్టుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.