Begin typing your search above and press return to search.

బింబిసార బిజినెస్ పై ఇవి నిజాలా? అపోహ‌లా?

By:  Tupaki Desk   |   9 July 2022 3:38 AM GMT
బింబిసార బిజినెస్ పై ఇవి నిజాలా? అపోహ‌లా?
X
ఏదైనా సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా బిజినెస్ ఎంత చేసింది? కంటెంట్ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? లాంటి చ‌ర్చ సాగ‌డం స‌హ‌జం. అగ్ర‌హీరోల సినిమాల‌కు ఎప్పుడూ బ‌జ్ ఉంటుంది. చిన్న హీరోల‌కు అది అంత సులువు కాదు. ఇక తెలుగు చిత్ర‌సీమ‌లో రాజీ అన్నదే లేకుండా సినిమాలు తీయ‌డంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎప్పుడూ త‌గ్గ‌లేదు. హీరోగా త‌న‌ని తాను పెద్ద తెర‌పై గ్రాండియ‌ర్ గా ఆవిష్క‌రించుకునేందుకు అత‌డు ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తున్నారు. నిర్మాత‌గా భారీ రిస్కులు చేస్తుంటాడు. ఈసారి అత‌డి ఆప్ష‌న్- బింబిసార‌.

ఇటీవ‌లే ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌లై ఆకట్టుకుంది. బాహుబ‌లి త‌ర‌హాలోనే ఈ మూవీ కూడా విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా ఉంటుందా? అంటూ ఒక ప్ర‌శ్న‌ను ట్రైల‌ర్ లేవ‌నెత్తింది. అయితే బాహుబ‌లి రేంజు బ‌డ్జెట్ పెట్ట‌క‌పోయినా క‌ళ్యాణ్ రామ్ ఈ మూవీ కోసం 50కోట్లు త‌గ్గ‌కుండా బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అయ్యాయి.

అంతేకాదు.. ఈ మూవీ బ‌డ్జెట్ కి త‌గ్గ రేంజులో బిజినెస్ సాగ‌డం క‌ష్టం. అందులో స‌గం వ‌ర‌కూ రావాల‌న్నా థియేట్రిక‌ల్- శాటిలైట్- ఓటీటీ రైట్స్ అన్నిటికీ క‌లిపి సాధ్య‌మ‌వుతుంద‌ని గుస‌గుస వినిపించింది. వోవ‌రాల్ గా ఈ మూవీ 18కోట్ల వ‌ర‌కూ బిజినెస్ సాగించింద‌ని ఒక సెక్ష‌న్ మీడియా టాక్ స్ప్రెడ్ చేసింది.

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా తెలుగు స్టేట్స్ హ‌క్కుల‌ను దిల్ రాజు కైవ‌శం చేసుకున్నార‌ని కేవ‌లం నైజాం కోసం 5.6 కోట్లు వెచ్చించిన ఆయ‌న ఓవ‌రాల్ గా 9 కోట్ల‌కు ఏపీ-తెలంగాణ రైట్స్ ఛేజిక్కించుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. న‌ష్టాలు రిస్క్ అన్న‌ది లేకుండా రిఫండ‌బుల్ విధానంలో దిల్ రాజు హ‌క్కుల‌ను కొనుగోలు చేసార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ బింబిసార‌పై ఎవ‌రికీ ఎలాంటి అంచ‌నాలు లేవు. ట్రైల‌ర్ త‌ర్వాత అమాంతం సీన్ మారింది. ఆ మాత్రం అయినా బిజినెస్ పూర్తి చేయ‌గ‌లిగింది. ఇంకా ఓవ‌ర్సీస్ రైట్స్ పెద్ద ధ‌ర‌కు విక్ర‌యించే వీలుంద‌ని అంచ‌నా. బింబిసార చిత్రంలో కేథరిన్ థెరిస్సా- సంయుక్త మీనన్ నాయిక‌లు. వశిష్ఠ దర్శక‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ కి ఇది ఒక ర‌కంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇందులో అత‌డు లుక్ ప‌రంగా చాలా బావున్నాడు. న‌ట‌న‌లోనూ గ్రేస్ క‌నిపిస్తోంది. బింబిసార పాత్ర‌లో అత‌డి ఆహార్యం ఆక‌ట్టుకుంది. మోడ్ర‌న్ వ‌ర‌ల్డ్ క‌నెక్టివిటీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆస‌క్తిక‌రం. భారీత‌నంతో కూడుకున్న విజువ‌ల్స్ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాయ‌నే ఆశిద్దాం.