Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ 'మూడు పాత్రల్లో ముప్పై వేషాలు' దర్శనమిస్తాడా..??

By:  Tupaki Desk   |   15 March 2021 11:30 AM GMT
పవర్ స్టార్ మూడు పాత్రల్లో ముప్పై వేషాలు దర్శనమిస్తాడా..??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ హిస్టోరికల్ సినిమా చేస్తున్నాడు. అదే హరిహర వీరమల్లు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రోజుకో వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. అయితే పవర్ స్టార్ నుండి ముందుగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందు రాబోతుంది. భారీ అంచనాల నడుమ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల అవుతోంది. పవర్ స్టార్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'ను వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ కు సంబంధించి చాలా రీసెర్చ్ చేశారట కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య రాజీవ్.

దాదాపు ఈ సినిమాలో పవన్ ముప్పై వరకు వెరైటీ దుస్తులలో కనిపిస్తాడని టాక్. అలా పవన్ వేశాధారణ కోసం ఐశ్వర్య దేశవ్యాప్తంగా వెయ్యి టన్నుల ఫాబ్రిక్ ను కొనుగోలు చేసిందట. ఇదివరకు డైరెక్టర్ క్రిష్ తో ఐశ్వర్య కంచె, గౌతమిపుత్రశాతకర్ణి సినిమాలకు పనిచేసి అవార్డులు కూడా అందుకుంది. ఈ సినిమా 17వ దశబ్దానికి చెందింది కాబట్టి ఐశ్వర్య కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో రీసెర్చ్ చేసిందట. ఆమె పవన్ కోసం ఆ కాలంనాటి దుస్తులు, క్లాత్, కలర్స్, అలంకరణ ఇలా అన్నిట్లో జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటికే సినిమా మోషన్ పోస్టర్, గ్లింప్స్ ఏ రేంజిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. అలాగే ఈ సినిమాలో పవన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడట. ఇదిలా ఉండగా వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.