Begin typing your search above and press return to search.

ఆ విషయంలో తమన్ బెస్ట్ అంతే

By:  Tupaki Desk   |   13 Feb 2020 11:15 AM GMT
ఆ విషయంలో తమన్ బెస్ట్ అంతే
X
సాంగ్స్ కంపోజ్ చేయడానికి ఒకరు నేపథ్య సంగీతం ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న నయా ట్రెండ్ ఇది. ఈ విషయంలో అందరికీ ఫస్ట్ ఛాయిస్ లా మారుతున్నాడు తమన్. అవును సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ మాత్రం బిజీగా లేదా అవుట్ పుట్ నచ్చకపోయినా మేకర్స్ వెంటనే తమన్ ని సంప్రదిస్తున్నారు. దీనికి రీజన్ నేపథ్యం సంగీతంలో తమన్ బెస్ట్ కావడమే.

మొన్నీ మధ్య మజిలీ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ ఇవ్వగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. తమన్ సంగీతంతో సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా క్లిక్ అయ్యాయి. దీంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఆల్మోస్ట్ తమన్ నే సంపదిస్తున్నారట. సైరా టైంలో కూడా రెహ్మాన్ బిజీ గా ఉండటంతో పోస్టర్ టీజర్ కి తమన్ ని సంప్రదించారు. ఇప్పుడు నాని , సుదీర్ బాబు సినిమాలకు కూడా నేపథ్య సంగీతం ఇవ్వనున్నాడు తమన్. ఈ సినిమాకు అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు.

నిజానికి ఈ జెనరేషణ్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో నుండి ఈ సంప్రదాయం మొదలైంది. మికీ జె మేయర్ సినిమాకు సాంగ్స్ ఇస్తే ఎంతో మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపథ్య సంగీతం ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అందరికీ కేరాఫ్ అడ్రెస్ అవుతున్నాడు తమన్.