Begin typing your search above and press return to search.

ఇలాంటి సినిమా మళ్లీ చేయనంటున్న మిల్కీ

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:02 AM GMT
ఇలాంటి సినిమా మళ్లీ చేయనంటున్న మిల్కీ
X
‘అభినేత్రి’ సినిమా చేసినందుకు ఫీలవుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇలాంటి సినిమా మళ్లీ చేయనని ఆమె అంటోంది. అలాగని తన సినిమా మీద ఆమె నెగెటివ్ కామెంట్స్ ఏమీ చేయట్లేదు. పాజిటివ్ వేలోనే ఈ వ్యాఖ్యలు చేసింది తమన్నా.

‘‘కెరీర్లో తొలిసారి త్రిభాషా చిత్రం చేశాను. మూడు భాషల్లో నటించడంలో ఎంత కష్టం ఉంటుందో ఈ సినిమాతో అర్థమైంది. ఒకేసారి మూడు భాషల్లో నటిస్తూ.. చేస్తున్న పాత్ర తీరుతెన్నులు అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండేలా చూడడం అన్నది మామూలు విషయం కాదు. అందుకే ఇంకోసారి అలాంటి కష్టం వద్దనుకుంటున్నా. ఇకపై ఇలా మూడు భాషల్లో తెరకెక్కే సినిమా చేయకూడదని గట్టిగా ఫిక్సయ్యాను’’ అని తమన్నా చెప్పింది. ‘అభినేత్రి’ సినిమాను మూడు భాషల్లో తీసినప్పటికీ.. 58 రోజుల్లోనే షూటింగ్ పూర్తయిందని.. దాన్ని బట్టే తాము ఎంత కష్టపడి ఉంటామో అర్థం చేసుకోవచ్చని తమన్నా చెప్పింది. ముందు ఈ సినిమాను తమిళ.. హిందీ భాషల్లో మాత్రమే చేయాలనుకున్నారని.. ఐతే తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చాకే దాన్ని తెలుగులోనూ చేద్దామని నిర్ణయించుకున్నారని తమన్నా వెల్లడించింది.

ఇక ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రోగ్రెస్ గురించి తమన్నా చెబుతూ.. ‘‘క్లైమాక్స్ లో భాగంగా నాపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్ని పూర్తి చేశా. నా పాత్రకు సంబంధించిన షూట్ ఇంకా కొంత భాగం మిగిలే ఉంది’’ అని వెల్లడించింది. ‘జాగ్వార్’లో స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘మన వల్ల ఒక సినిమాకు అదనపు ఆకర్షణ వస్తుందనుకుంటే స్పెషల్ సాంగ్ చేయడంలో తప్పు లేదు. అందులోనూ రెమ్యూనరేషన్ బాగున్నపుడు చేస్తే తప్పు లేదు కదా’’ అని తమన్నా వ్యాఖ్యానించింది.