Begin typing your search above and press return to search.
తమన్నా ఎంత చక్కగా మాట్లాడిందంటే..
By: Tupaki Desk | 10 Oct 2016 9:30 AM GMTమామూలుగా హీరోయిన్లకు ఒక స్థాయి రాగానే.. ఇండస్ట్రీలో ఓ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకోగానే స్టీరియో టైపు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కమర్షియల్ సినిమాలు చేసి బోర్ కొట్టేసిందని.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసం చూస్తున్నానని అంటుంటారు. కమర్షియల్ సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అలాగే హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. కానీ తమన్నా మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడింది.
‘‘నేను నాకు నచ్చిన పాత్రల్నే ఎంచుకునే స్థితిలో ఉన్నాను. అంతమాత్రాన ఇప్పటివరకూ చేస్తూ వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు నో అంటాను అనుకోవద్దు. వాటిని తక్కువ చేసి చూడను. నాలుగు పాటలు.. మాస్ మసాలా ఫైట్లు ఉన్న కమర్షియల్ సినిమాలు నాకింకా ఇష్టమే. నేను అలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఇప్పుడు వాటిని వదులుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తా.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తా అని స్టేట్‌మెంట్ ఇవ్వను.
అదే సమయంలో కొంచెం కొత్తగా ఉన్న క్యారెక్టర్లు.. సినిమాలు చేయాలనుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు కమర్షియల్ సినిమాలు చేయక తప్పదు. వాటి ద్వారా మెప్పిస్తూనే కొంచెం కొత్తగా ఉండే సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయడం ముఖ్యం. ఇక హీరో హీరోయిన్ల మధ్య పారితోషకం విషయంలో తేడా గురించి మాట్లాడాల్సి వస్తే.. అది ఉన్న మాట వాస్తవం. కానీ హీరోల మార్కెట్ ఎక్కువ. ఒక సినిమా ఫ్లాపైతే దాని ఎఫెక్ట్ వాళ్ల మీదే ఎక్కువ పడుతుంది. కాబట్టి నాణేనికి రెండో వైపు కూడా చూడాలి. ఐతే రెమ్యూనరేషన్ విషయంలో అంతరం కొంచెం తగ్గితే బావుంటుందన్నదినా ఉద్దేశం’’ అని తమన్నా చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/