Begin typing your search above and press return to search.

తమన్నా పెళ్లి రూమర్స్‌ నిజమేనా??

By:  Tupaki Desk   |   19 April 2016 7:59 AM GMT
తమన్నా పెళ్లి రూమర్స్‌ నిజమేనా??
X
సడన్‌ గా ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నా పెళ్ళి రూమర్లు ఊపందుకున్నాయి. ఒక నేషనల్‌ మీడియా పబ్లిష్‌ చేసిన వివరాల ప్రకారం.. హిందీలో రణవీర్‌ సింగ్‌ సరసన చేసే సినిమాయే తమన్నా ఆఖరి సినిమా అంటున్నారు. ఆ తరువాత అమ్మడు పెళ్ళి చేసుకుని యాక్టింగ్‌ నుండి రిటైర్‌ అవుతుందట.

మ్యాటర్‌ ఏంటంటే.. గత రెండేళ్లుగా.. ముంబయ్‌ కు చెందిన ఫ్యామిలీ ఫ్రెండి ఒకరితో తమన్నా ప్రేమాయణం నడుస్తోందట. అతగాడు ఒక కంప్యూటర్‌ ఇంజనీర్. సాఫ్ట్ వేర్‌ సైడ్‌ బాగానే సంపాదిస్తున్నాడట. అతిని ప్రేమను పెళ్ళిగా మార్చేసి.. నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు ఒక ప్రముఖ మీడియా స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్‌ చేసుకుని.. ఇక కొత్త సినిమాలను అమ్మడు ఒప్పుకోదట. అయితే పెళ్ళయ్యాక సినిమాలు మానేసి.. తాను స్థాపించిన గోల్డ్ డిజైన్‌ కంపెనీ వైట్‌ అండ్‌ గోల్డ్‌ బిజినెస్‌ చూసుకుంటుందట అమ్మడు.

మరి ఈ రూమర్లలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని.. ప్రస్తుతం అమ్మడు మాత్రం దర్మదురయ్‌ అనే తమిళ సినిమా.. అలాగే తెలుగులో బాహుబలి 2 షూటింగ్‌ కోసం వెయిట్‌ చేస్తోంది. అది సంగతి.