Begin typing your search above and press return to search.

బాహుబలికి బర్త్ డే.. అవంతిక సందడి

By:  Tupaki Desk   |   23 Oct 2015 6:32 AM GMT
బాహుబలికి బర్త్ డే.. అవంతిక సందడి
X
బాహుబలి సీక్వెల్ ఎంతవరకూ వచ్చింది? షూటింగ్ సంగతేంటి ? ఎప్పుడు స్టార్టవుతుంది ? ముందుగా చెప్పినట్లు 2016లో రిలీజ్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం కానీ.. బాహుబలి యూనిట్ అంతా అదే పనిలో ఉన్నారని మాత్రం చెప్పేయచ్చు. అక్టోబర్ 23.. ప్రభాస్ బర్తడే. ఈ సందర్భంగా.. బాహుబలి యూనిట్ అంతా కలిసి రచ్చరచ్చే చేసేశారు. సెల్ఫీలు - ఫోటోలు - పార్టీలు.. ఒకటే హడావిడి. వాటిలో ఫోటోలో పైన మనకు కనిపిస్తున్నాయ్. ఈ ఫోటోల్లో అందరి సందడీ ఒకలా ఉంటే.. అనామిక పాత్రధారి తమన్నా మాత్రం మరీ రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

అన్నీ ఉన్నా.. స్టార్లతో బ్లాక్ బస్టర్ అనే మాటకు అడ్రస్ తెలీదు మిల్కీబ్యూటీకి. అలాంటిది.. ఏకంగా టాలీవుడ్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పేలా చేసిన బాహుబలిలో.. లీడ్ హీరోయిన్లలో ఒకరిగా ఛాన్స్ వచ్చింది తమ్మూకి. బాలీవుడ్ లో కూడా బాగా పాపులారిటీ సంపాదించిపెట్టిందీ సినిమా. దీంతో ఆ బాహుబలి అన్నా.. ఆ మూవీలో హీరో అయిన ప్రభాస్ అన్నా విపరీతమైన అభిమానం చూపిస్తోంది తమ్మూ. అందుకే ప్రభాస్ పుట్టిన రోజును తన బర్త్ డే కంటే సంతోషంగా గడిపేస్తోంది. అన్నిటికీ మించి ప్రభాస్ అత్యంత సన్నిహితంగా దిగిన సెల్ఫీ.. ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ లో బాగా హల్ చల్ చేస్తోంది.

ఆన్ స్క్రీన్ పై ఇంత క్లోజ్ నెస్ అంటే.. రొమాంటిక్ సీన్స్ కోసం తప్పదనుకోవచ్చు. కానీ ఆఫ్ స్క్రీన్ లో అందరూ ఉండగానే.. ఇంత క్లోజ్ గా ఫోటో దిగిందంటే.. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ అర్ధమవుతుంది. సాధారణంగా రిజర్వ్ డ్ గా ఉండే ప్రభాస్ కూడా.. బాహుబలి కారణంగా కోయాక్టర్స్ తో ఏళ్లపాటు జర్నీ చేయాల్సి రావడంతో.. మంచి ఫ్రెండ్ అయిపోతున్నాడు మిగతావాళ్లకి. అదీ బాహుబలి బర్త్ డే నాడు అవంతిక సందడికి అసలు కారణం.