Begin typing your search above and press return to search.
వీళ్ల సొగసు చూడతరమా!
By: Tupaki Desk | 28 April 2016 1:00 AM ISTఒక అందమైన అమ్మాయి చిన్న వలపు బాణం విసిరితేనే తట్టుకోలేరు కుర్రకారు. మైకం కమ్మేసి లోకాన్నే మరిచిపోతారు. ప్రేమ పిచ్చోళ్లై కాళిదాసులైనా అయిపోతారు. అలాంటిది అప్సరసల్లాంటి ఇద్దరమ్మాయిలు ఒకేసారి కవ్వింపుకి దిగితే ఇక పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? కోలుకోవడానికి ఎంత సేపు పడుతుందో కూడా అర్థం కాదు. వీళ్లని చూశాక మీక్కూడా అదే పరిస్థితిలెండి.
అసలే పాల మీగడని మరిపించే మేనిఛాయ వీళ్లిద్దరిదీ. దానికితోడు దేవుడు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ల కటౌట్లని చెక్కినట్టున్నాడు. అందుకే అంతటి అపురూప సౌందర్యంతో పుట్టేశారు. ఇలాంటి భామలు కథానాయికలవక ఏమవుతారు చెప్పండి? హన్సిక - తమన్నా ఏళ్ల తరబడి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇన్నాళ్లూ ఒకొక్కరినీ విడిగా చూశాం. ఇప్పుడు జాయింటుగా చూసేయండని హోల్‌సేల్ ఆఫర్ ఇచ్చేశారిలా. కమర్షియల్ యాడ్ కోసమో మరేంటో తెలియదు కానీ.. ఇద్దరూ కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఆ సందర్భంలోనే పోటీలు పడి మరీ సెల్ఫీలు తీసుకొన్నారు. ఇద్దరూ కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆ ఫొటోల్ని ఇలా పెట్టి కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు. మీరు మాత్రం ఇక్కడ అదే పనిగా చూస్తూ ఉండిపోమాకండే!