Begin typing your search above and press return to search.

ఆ డ్యాన్సులకు తమ్ము, రకుల్ ఫీజెంతంటే

By:  Tupaki Desk   |   17 Nov 2016 4:11 AM GMT
ఆ డ్యాన్సులకు తమ్ము, రకుల్ ఫీజెంతంటే
X
కూతురు పెళ్లి కోసం పెడుతున్న ఖర్చు 50 కోట్లు అంటూ గాలి జనార్ధన రెడ్డి చెబుతున్నా.. వందల కోట్లలోనే వెచ్చించారనే విషయం కనిపిస్తూనే ఉంది. అప్పటివరకూ ఉన్న మాటలన్నీ వాస్తవాలే అని.. సౌత్ లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లు వరుసగా డ్యాన్సులు చేసేయడంతోనే అర్ధమైంది.

సౌత్ మొత్తంతో పాటు నార్త్ లోనూ క్రేజ్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకి.. బ్రాహ్మణి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసేందుకు 70 లక్షల రూపాయలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బ్యూటీగా ఓ రేంజ్ కి చేరి.. ఇతర ఇండస్ట్రీలపై ఇప్పుడిప్పుడే కన్నేసిన రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా ఫ్యాన్సీ ఆఫరే దక్కిందట. ఈ భామకు ఒక్క షోకి గాను 20 లక్షలు ముట్టాయని టాక్. వీరిద్దరు మాత్రమే కాదు.. మరికొందరు హీరోయిన్లు కూడా ఈ పెళ్లిలో చిందులు వేసి అలరించారు.

ప్రియమణి.. కేథరిన్.. శాన్వి.. లాంటి ఇతర భామలకు కూడా భారీగానే ముట్టచెప్పి పట్టుకొచ్చినట్లు టాక్. నిమిషాల పాటు ఉండే ఈ ప్రదర్శనకు పిలిచిన హీరోయిన్లతో పాటు వారి మేనేజర్లకు కూడా స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఇక జబర్దస్త్ కామెడీ టీం వేసిన స్కిట్స్ కూడా ఆహుతులను బాగానే అలరించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/