Begin typing your search above and press return to search.

తమ్మూ.. తాప్సీ.. దుమ్ములేపుతారు

By:  Tupaki Desk   |   26 Jun 2015 9:24 AM IST
తమ్మూ.. తాప్సీ.. దుమ్ములేపుతారు
X
ఒక పక్కన మిల్కీ బ్యూటి తమన్నా.. మరో ప్రక్కన రింగులు జుత్తు గంగ తాప్సీ.. ఇద్దరూ ఇద్దరూ. తన సొగసులను ఆరబోయడం ఆరితేరిన మంగ మన మిల్కీ.. అలాగే అందాల తోటలో యువతను జోలలాడించే గంగ మన ఢిల్లీ బెల్లి. ఈ ఇద్దరూ శుక్రవారం రాత్రి దుమ్ములేపేయడానికి ప్రిపేర్‌ అవుతున్నారు. ఇంతకీ మ్యాటర్‌ ఏంటట??

అబ్బే ఏమీ లేదు.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలకు సంబంధించి ఫిలింఫేర్‌ అవార్డులను ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఈ అవార్డుల సంబరం జరగనుంది. తెలుగులో ఇప్పటికే రేసుగుర్రం వంటి సినిమాలు అత్యంత ఎక్కువ నామినేషన్లతో దూసుకుపోతున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంటైర్‌ సౌత్‌ నుండి టాప్‌ స్టార్స్‌ చాలామంది హాజరు కానున్నారు. వీరందరికీ తమ కైపెక్కించే కిక్కులతో అలరించడానికి తమన్నా, తాప్సీలు రెడీ అయిపోతున్నారు.

ఒక ప్రక్కన తన మోకాలు వాచిపోయినా కూడా లెక్కచేయకుండా కష్టపడుతోంది తాప్సీ. మరో ప్రక్కన అలసటను కూడా లెక్కచేయకుండా మూడు రోజుల నుండి ప్రాక్టీస్‌ చేస్తోంది తమన్నా. ఇద్దరూ స్టేజీనే ఇరగదీసి దుమ్ములేపేయడం ఖాయం.