Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ ఆ విషయంలో బయట పడటం లేదు..!

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 AM GMT
మిల్కీ బ్యూటీ ఆ విషయంలో బయట పడటం లేదు..!
X
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమ వ్యవహారాల గురించి పెళ్లి గురించి ఎక్కువగా గతంలో మీడియాలో వార్తలు వచ్చిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు పుకార్లు ఏమైనా వచ్చినా కూడా ఒకటి రెండు రోజుల్లో వాటిని జనాలు మర్చిపోయేవారు. కానీ తాజాగా తమన్నా యువ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను కాస్త ఎక్కువ సీరియస్ గా జనాలు తీసుకుంటున్నారు.

తమన్నా మరియు విజయ్ వర్మలు ప్రేమలో ఉన్నారు అని చెప్పేందుకు సాక్ష్యం ఒక ఫొటో కూడా లీక్ అయ్యింది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఆ ఫొటో తో కచ్చితంగా ప్రేమలో ఉన్నట్లుగా పలువురు ఒక అభిప్రాయంకు వచ్చేశారు. కానీ తమన్నా మాత్రం ఇప్పటి వరకు ఆ విషయాన్ని నిర్థారించడం లేదు.

న్యూ ఇయర్ పార్టీ ని ఇద్దరు కలిసి చేసుకున్నారని సన్నిహితులు లీక్ ఇస్తున్నారు. దాంతో సోషల్‌ మీడియాలో తమన్నా మరియు విజయ్ వర్మకు సంబంధించిన న్యూ ఇయర్ ఫొటోలను జనాలు కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు హింట్ వదిలి పెట్టలేదు.

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ప్రేమ విషయం గురించి అతి త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హీరోయిన్‌ గా మిల్కీ బ్యూటీ క్రేజ్ గతంలో ఉన్నంతగా లేదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. అది విజయ్ వర్మతోనేనా అనేది తెలియాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.