Begin typing your search above and press return to search.
మెరిసిపోయింది మిల్కీనే!
By: Tupaki Desk | 19 Jun 2016 9:01 AM GMTఅవార్డు ఫంక్షన్లకి అర్థమే మారిపోయిందిప్పుడు. ఇదివరకు ప్రతిభ - ప్రోత్సాహం అనే విషయాలకే అక్కడ ప్రాధాన్యం కనిపించేది. కానీ ఇప్పుడు అంతకుమించిన వ్యవహారాలు అక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు తమ అందచందాల ప్రదర్శనకి అవార్డు వేడుకల్ని వేదికలుగా మార్చుకొంటున్నారు. స్టైల్ విషయంలో ఎవరెంత టాలెంటు చూపిస్తారో అన్నట్టుగా ప్రేక్షకులు - మీడియా వర్గాలు హీరోయిన్ల డ్రెస్సప్ పైనే దృష్టిపెడుతున్నారు. దాంతో హీరోయిన్లు మరింతగా రెచ్చిపోతున్నారు. స్టైలిస్ట్ ల్నీ - డిజైనర్లని సంప్రదిస్తూ ప్రత్యేకంగా ముస్తాబవుతున్నారు. సీనియర్ భామలు తమ గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదని చాటేందుకు - కొత్త భామలు మా అందం చూడండంటూ అవకాశాలకి గాలం వేసేందుకు అవార్డు ఫంక్షన్లని చక్కగా వాడుకొంటున్నారు.
ఇదివరకు అవార్డు ఫంక్షన్లకి హీరోయిన్లు అరుదుగా వెళ్లేవాళ్లు. ఇటీవల మాత్రం ఏ చిన్న సంస్థ ఫంక్షన్ ని నిర్వహిస్తున్నా రెక్కలు కట్టుకొని మరీ వాలిపోతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆ వేడుకకి దక్షిణాదికి చెందిన తారలందరూ హాజరయ్యారు. హీరోయిన్లు ఒకొక్కరు ఒక్కో స్టైల్ తో అదరగొట్టారు. వాళ్ల అందచందాల్ని చూడ్డానికి రెండు కళ్లు చాలలేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్లు ఎవరెలా ముస్తాబైనా అందులో తమన్నానే హైలెట్ గా నిలిచిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ తారల తరహాలో పొడుగాటి గౌను వేసి సప్తవర్ణాలన్నీ నాలోనే ఉన్నాయన్నట్టుగా ఆమె మెరిసిపోయింది.