Begin typing your search above and press return to search.

తమ్మూ.. ఈ స్టైలింగ్ ఎందుకంటావ్!?

By:  Tupaki Desk   |   20 Dec 2016 9:30 AM GMT
తమ్మూ.. ఈ స్టైలింగ్ ఎందుకంటావ్!?
X
ముంబై బ్యూటీ అయినా సౌత్ లోనే ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. నిండా 15 ఏళ్లు రాకుండానే యాక్టింగ్ స్టార్ట్ చేసేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ అనిపించుకునేంత ఎక్స్ పీరియన్స్ సాధించేసింది. 2005లోనే సినీ అరంగేట్రం చేసిన అరడజన్ భాషల్లో సినిమాలు చేసేస్తున్నా.. ఇంకా ఈ బ్యూటీ వయసు ముప్ఫైల్లోకి కూడా ఎంటర్ కాకపోవడమే.. అమ్మడి మెరుపులకు అసలు కారణం.

అయితే.. తన డ్రెసింగ్ స్టైలింగ్ విషయాల్లో మిల్కీ బ్యూటీ చాలా జాగ్రత్తగానే ఉండేది. కొత్త స్టైలింగ్ ట్రై చేసినా తనకు సూట్ అయ్యేవి తప్ప.. వేరే వాటి జోలికి వెళ్లేది కాదు. అవకాశాలు తగ్గాయనో.. లేక ముప్ఫైల్లోకి వచ్చేసరికి రేస్ లో ముందుకెళ్లాలని డిసైడ్ అయిందో కానీ.. ఈ మధ్య తన డ్రెసింగ్ లో బోలెడన్ని మార్పులు చూపిస్తోంది తమన్నా. మొన్నామధ్య సౌత్ స్కోప్ లైఫ్‌ స్టయిల్ అవార్డ్స్ లో.. క్లీవేజ్ షో చేస్తూ తమ్మూ ఇచ్చిన పోజులకు.. నెగిటివ్ మార్కులు పడ్డాయి.

అయినా సరే ఇప్పుడు స్టార్ డస్ట్ అవార్డ్స్ లోనూ అదే తంతు. ఫ్రెంట్ లెస్ సోకులు చూపించేందుకు తెగ ఉబలాటపడిపోతున్నట్లుగా.. మెరిపించింది. కానీ పెర్ఫామెన్స్ విషయంలో బోలెడంత ట్యాలెంట్ ఉందేమో కానీ.. క్లీవేజ్ ప్రదర్శన విషయంలో ఆ రేంజ్ కొలతలు అమ్మడిలో లేవనే విషయం ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయినా సరే ఎందుకిలా రచ్చ చేస్తోందో అంటూ ఫ్యాషన్ క్రిటిక్స్ అందరూ విమర్శలు గుప్పించేస్తున్నారు. మరి తమ్మూ రియాక్షన్ ఎలా ఉంటుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/