Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ కు రాలే.. కాని అవార్డ్ అందుకుంది

By:  Tupaki Desk   |   20 Nov 2016 4:18 AM GMT
ప్రమోషన్స్ కు రాలే.. కాని అవార్డ్ అందుకుంది
X
దుబాయ్ లో సెటిల్ అయిన మలయాళం మూవీ లవర్స్ కోసం.. అక్కడే ప్రతీ ఏడాది ''ఏసియావిజన్ అవార్డ్స్'' అనే ఒక ఈవెంట్ ను ఒక సంస్థ నిర్వహిస్తుంది. అయితే ఎప్పుడూ మలయాళ సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చే వీరు ఇప్పుడు తెలుగు - తమిళ్ - కన్నడ సినిమాలకు కూడా అవార్డులు ఇస్తున్నారు. మొన్ననే మన రామ్ చరణ్‌ కు స్టయిల్ ఐకాన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డ్ కూడా ఇచ్చారు.

కట్ చేస్తే.. ఇదే అవార్డు షో లో.. ఉత్తమ తమిళ నటి ఎవరు? అదిగో ఎనౌన్స్ మెంట్ వినిపిస్తోంది.. ''ధర్మదురై'' సినిమాలో కత్తిలాంటి నటన చూపినందుకు మిల్కీ బ్యూటి తమన్నా పేరును ప్రకటించారు. షార్జా లో జరిగిన ఈ ఈవెంట్ కు వెళ్ళిన తమన్నా.. వెంటనే స్టేజెక్కేసి అవార్డును తీసేసుకుంది. శాటిన్ లో మెరుస్తున్న గౌనులో సిండ్రెల్లా టైపులో స్టేజీ మీదకెళ్లి అవార్డు అందుకుంది అమ్మడు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమా రిలీజైన టైములో అమ్మడు మూవీని కనీసం ప్రమోట్ కూడా చేయలేదు. నిర్మాతతో ఏవో తేడాలు రావడం వలన.. ఒక్కటంటే ఒక్కరోజు కనిపించి.. తరువాత హ్యాండిచ్చింది. ప్రమోషన్లకు రారు కాని.. అవార్డు వస్తుంది అంటే మాత్రం వెంటనే వాలిపోతారా? ఇదే ఇప్పుడు కామన్ పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్.

తమన్నా ఒక్కత్తే కాదులేండి.. చాలామంది హీరోయిన్లు అలాగే ఉన్నారు. ఎప్పుడూ ప్రమోషన్లకే రాని నయనతార.. మొన్న ఒక అవార్డు ఫంక్షన్లో ప్రియుడు సాక్షిగా.. సారీ ప్రియుడు చేతులుమీదుగా అవార్డును అందేసుకోవడానికి వచ్చేయలా. అలా అనమాట. ఒక్కరికి కూడా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులకు న్యాయం చేయాలి అతను లాస్ అవ్వకూడదు అనే తపన లేనేలేదు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/