Begin typing your search above and press return to search.

చిన్న వయసులోనే అన్ని అనుభవించా : తమన్నా

By:  Tupaki Desk   |   11 Jun 2019 5:30 AM GMT
చిన్న వయసులోనే అన్ని అనుభవించా : తమన్నా
X
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌ లో 15 ఏళ్ల వయసులోనే 'శ్రీ' అనే చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ చిత్రంతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఆ తర్వాత తమిళంలో 'కేడీ' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం కూడా అంతంత మాత్రంగానే నిలిచింది. ఎప్పుడైతే తెలుగులో 'హ్యాపీడేస్‌' చిత్రంలో నటించిందో తమన్నా కెరీర్‌ పూర్తిగా టర్న్‌ అయ్యింది. తమన్నా కెరీర్‌ లో పలువురు స్టార్‌ హీరోలు సూపర్‌ స్టార్‌ లతో కలిసి నటించింది. చిన్న వయసులోనే స్టార్‌ స్టేటస్‌ ను ఈ అమ్మడు దక్కించుకుంది.

తాజాగా ఈమె 'ఖామోషీ' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా తమన్నా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను 2005వ సంవత్సరంలో శ్రీ చిత్రంలో నటించాను. ఆ సమయంలో నాకు సినిమాలో నటించాలనే కోరిక తప్ప మరేం తెలియదు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత నుండి నాకు నేను ఎంతగానో నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్న వయసులోనే తెలుగు మరియు తమిళం భాషలను నేర్చుకున్నాను.

20 ఏళ్ల లోపే నేను స్టార్‌ డంను మరియు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను పొందానంటూ సంతోషం వ్యక్తం చేసింది. సౌత్‌ లో తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి మాటల్లో చెప్పలేనంటూ మురిసి పోయింది. భాష వస్తే హావభావాలు ఇంకా బాగా ఇవ్వవచ్చు అని ముందు నుండి నేను అనుకున్నాను. అందుకే భాష నేర్చుకునేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను. ఇక సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌ జాతకాలు ప్రతి శుక్రవారం మారుతూ ఉంటాయి. నాకు ఎన్నో శుక్రవారాలు సంతోషాన్ని కలిగిస్తే.. మరి కొన్ని శుక్రవారాలు నిద్రలేని రాత్రులను మిగిల్చాయి అంటూ తమన్నా గత జ్ఞాపకాలను నెమరేసుకుంది.

ప్రస్తుతం తెలుగు.. తమిళం నటిస్తున్న తమన్నా అవకాశాలు ఉన్నంత వరకు నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈనెల 14న ఖామోషీ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ చిత్రంపై భారీ అంచనాలున్నట్లుగా తమన్నా పేర్కొంది. తప్పకుండా ఇది తనకు మరో చక్కని సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తోంది.