Begin typing your search above and press return to search.
బాబోయ్ ప్రభాస్.. ఆ జాబితాలో తమన్నా చేరింది
By: Tupaki Desk | 15 Feb 2023 3:00 PM GMTప్రభాస్ తో వర్క్ చేసిన దాదాపు అందరూ కూడా ఆయన ఆతిథ్యం ను ఏదో ఒక సందర్భంలో స్వీకరించాల్సి ఉంటుంది.. స్వీకరిస్తూనే ఉంటారు. ఇప్పటి నుండి కాదు.. సుదీర్ఘ కాలంగా ప్రభాస్ తన ఆతిథ్యం తో తనతో వర్క్ చేసిన వారిని మరియు తన సన్నిహితులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ప్రభాస్ ఆతిథ్యం గురించి చర్చ జరుగుతోంది.
ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ యొక్క ఆతిథ్యం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. గతంలో ప్రభాస్ తో వర్క్ చేసిన చాలా మంది ఆయన షూటింగ్ సందర్భంగా వ్యవహరించే తీరు మరియు ఆయన ఇంటి నుండి వచ్చే లంచ్ మరియు డిన్నర్ బాక్స్ ల గురించి మాట్లాడటం జరిగింది. తమన్నా కూడా అదే తరహా లో మాట్లాడి ఆ జాబితాలో చేరిపోయింది.
తమన్నా మాట్లాడుతూ.. ప్రభాస్ తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటాడో దేశం మొత్తానికి తెలుసు. ఆయన భోజనం కు ఆహ్వానిస్తే 30 రకాల వంటకాలను తయారు చేయిస్తాడు. డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి ప్రభాస్ కానే కాదు. రాజు అనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అనిపించే విధంగా ప్రభాస్ తన మంచి తనంతో అతిథి మర్యాదలతో బాబోయ్ అనిపిస్తాడని తమన్నా పేర్కొంది.
తనకు అంతగా స్టార్ డమ్ ఉన్నా.. అభిమానులు ఉన్నా కూడా చాలా సింపుల్ గా అందరితో కలిసి పోతూ ఉంటాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. ప్రభాస్ కు మాత్రమే అలా సాధ్యం. ఆయన యొక్క సింప్లిసిటీ అందరికి నచ్చతుందని తమన్నా పేర్కొంది.
గతంలో ప్రభాస్ యొక్క ఆతిథ్యం గురించి ఇలా మాట్లాడిన వారిలో అమితాబచ్చన్ మొదలుకుని దీపికా పదుకునే.. శృతి హాసన్.. శ్రద్దా కపూర్.. కృతి సనన్ ఇంకా ఎంతో మంది సౌత్ స్టార్స్ కూడా ఉన్నారు. ఆయన ఆతిథ్యం పొందాలని కూడా చాలా మంది ప్రభాస్ తో వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారు అంటూ ఇండస్ట్రీ లో టాక్ ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఉన్నాయి. అందులో ఆదిపురుష్ మరియు సలార్ లు ఈ ఏడాది లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రాజెక్ట్ కే మరియు మారుతి దర్శకత్వంలో సినిమా కూడా సెట్స్ పై ఉన్నాయి. రాబోయే రెండు సంవత్సరాల్లు ప్రభాస్ నుండి అయిదు ఆరు సినిమాల వరకు వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.