Begin typing your search above and press return to search.
12 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ..
By: Tupaki Desk | 8 Oct 2017 5:30 PM GMTసినీ ఫీల్డ్ లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా నటనలో తేడా ఏం కనిపించకపోయినా అందంలో మాత్రం చాలా తేడా కనిపిస్తుందనే చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కో అందంతో ఆకట్టుకుంటారు. కొందరు బొద్దుగా ఉంటే మరికొందరు సన్నగా ఉంటారు. కొందరు సొట్ట బుగ్గలతో అలరిస్తే మరికొందరు అందమైన చిరునవ్వుతో ఆకర్షిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్క తరహా బ్యూటీని మెయింటెన్ చేస్తున్నారు. అదే తరహాలో ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే మిల్కీ సైరన్ తమన్నా కూడా అందంలో చాలా స్పెషల్ అనే చెప్పాలి.
సౌత్ లో మిల్కీ బ్యూటీ అని తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలను చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా తన అందాలతో లేటెస్ట్ హీరోయిన్స్ కి గట్టి పోటీనే ఇస్తోంది. అమ్మడు సినిమాల్లోకి వచ్చి దాదాపు పన్నెండేళ్ళు కావొస్తోంది. అయితే ఇన్నేళ్ల కెరీర్ ఎలా గడిచిపోయిందో తనకి అర్థం కావడంలేదని అంటోంది అంతే కాకుండా చాలా ఆశ్చర్యంగా కూడా ఉందంటోంది. ఇంకా ఏమందంటే.. నా గ్రాఫ్ ఎంటనేది ఇంకా నాకు పూర్తిగా తెలియదు. ఇప్పుడిపుడే పూర్తిగా తెలుసుకుంటున్నా.. ఇంకా నేను చెయ్యాల్సినవి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఇక సక్సెస్ - ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో లేదు. అంతా దేవుడు రాత. మన పని మనం చేసుకుంటూ పోవడమే గాని మనం కోరుకున్నట్లు అంతా జరగదు.. అంటోంది తమన్నా.
''ఎన్ని సినిమాలు తీసినా హ్యాపీ డేస్ నాకు స్పెషల్. నా ఫస్ట్ హై పాయింట్ ఆ సినిమా. ఆ తర్వాత తమిళ్ లో కార్తీ - పయ్యా సినిమా నాకు మంచి ఎనర్జీని ఇచ్చింది. ఇక 100% లవ్ నాకు నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఊపిరి సినిమా కూడా నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం'' అంటూ మిల్కీ బ్యూటీ వివరించింది.