Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటి ఫినిష్‌ చేసేసింది

By:  Tupaki Desk   |   16 March 2016 5:00 PM IST
మిల్కీ బ్యూటి ఫినిష్‌ చేసేసింది
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తన ట్యాలెంట్ మొత్తం చూపించేస్తోంది. బాహుబలి, బెంగాల్ టైగర్ ల విజయాలతో జోష్ మీద ఉండడంతో.. ఆ ఉత్సాహాన్ని తర్వాత సినిమాల్లోనూ ప్రదర్శిస్తోంది. నాగ్ - కార్తిలతో కలిసి మిల్కీ నటించిన ఊపిరి.. విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం కోసం తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్న తమన్నా.. ఇప్పుడా కార్యక్రమం కూడా కంప్లీట్ చేసింది.

డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఈ విషయాన్ని చెప్పింది తమ్మూ. 'వావ్.. ఇప్పుడే ఊపిరి కోసం డబ్బింగ్ పూర్తి చేశా. నా స్వీట్ హార్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో..' అంటూ ట్వీట్ చేసింది తమన్నా. తొలిసారిగా డబ్బింగ్ కంప్లీట్ చేసిన ఉత్సాహం తమ్మూలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది కానీ.. స్టూడియోలో మాత్రం నానా రచ్చ చేసేసిందట. మామూలుగానే హై ఎనర్జీతో ఉండే తమన్నా.. తన ట్యాలెంట్ ప్రదర్శించే ఛాన్స్ వచ్చేసరికి మరింతగా రెచ్చిపోయిందంటున్నారు. అయితే.. తమన్నా చెప్పే డబ్బింగ్ పార్ట్.. చాలా త్వరగా అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

తమన్నాకి తెలుగు బాగానే వచ్చినా.. మొదటి సారి డబ్బింగ్ చెబుతూ, ఇంత స్పీడ్ గా పూర్తి చేసేయడం విశేషమే. అయితే.. ఈ మూవీల తమన్నా కేరక్టర్ చాలా చిన్నదేమో అనే అనుమానాలు వస్తున్నాయిపుడు. ఎందుకంటే.. ఊపిరికి మాతృక అయిన ఫ్రెంచ్ మూవీలో ఈ రోల్ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండదు మరి.