Begin typing your search above and press return to search.

తమ్మూ డాడ్‌ ఏమంటున్నారంటే..

By:  Tupaki Desk   |   20 April 2016 4:36 AM GMT
తమ్మూ డాడ్‌ ఏమంటున్నారంటే..
X
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పెళ్లిపై ఇటు సౌతిండియాతో పాటు అటు బాలీవుడ్ లో కూడా బోలెడన్ని వార్తలు వచ్చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఓ కంప్యూటర్ ఇంజినీర్ తో డేటింగ్ చేస్తోందని, బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ తర్వాత పెళ్లి చేసేసుకుంటోందని కూడా చెప్పేశారు.

అయితే తమ కూతురి పెళ్లి గురించిన వార్తలన్నీ రూమర్స్ అంటున్నాడు తమ్మన్నా ఫాదర్. ఈయన తండ్రిగానే కాకుండా.. తమ్మూ కెరీర్ కి సంబంధించిన ప్లానింగ్ ని కూడా దగ్గరుండి చూసుకుంటాడు. 'తమన్నా పెళ్లిప్లానింగ్ గురించి నేను కూడా చదివాను. కానీ ఇందులో నిజం లేదు. ప్రస్తుతం మా అమ్మాయి సినిమాలతో మాత్రమే బిజీగా ఉంది, కెరీర్ పై చాలా సంతోషంగా కూడా ఉంది' అంటున్నాడీయన.

ప్రస్తుతం తమిళ్ మూవీ ధర్మదురైతో పాటు.. ప్రభుదేవా - సోనూసూద్ లు నటిస్తున్న హిందీ-తమిళ్-తెలుగు ట్రైలింగ్యువల్ మూవీలో కూడా నటిస్తోంది. ఇది కాకుండా.. రోహిత్ శెట్టి మరుసటి చిత్రంలో కూడా తమన్నానే లీడ్ హీరోయిన్ గా తీసుకోనున్నారట. ఇక బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ లో జూన్ నుంచి జాయిన్ కానుంది తమన్నా.