Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క్లాసికల్ కి మోడ్రన్ టచ్

By:  Tupaki Desk   |   30 Oct 2016 4:42 AM GMT
ఫోటో స్టోరి: క్లాసికల్ కి మోడ్రన్ టచ్
X
సినిమాల సంగతి ఎలా ఉన్నా ఎప్పుడూ మాంచి హుషారు చూపించడం మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషాలిటీ. ఆశించిన రేంజ్ లో సినిమాలు కానీ.. కెరీర్ పరుగులు పెట్టే స్థాయిలో హిట్స్ లేవు. సహజంగా హీరోయిన్లకు ఏదో ఒక భాషలో అయినా కెరీర్ పీక్స్ లో ఉంటుంది. కానీ తమ్మూకి ఎక్కడా సినిమాల్లో పెద్దగా వెలుగులు లేవు. అలాగని ఆ లోటు తన ఫేస్ లో ఏ మాత్రం చూపించదు తమన్నా.

ఇప్పుడు దీపాల పండుగ దీపావళి వచ్చేసింది. కొత్త పండుగ వచ్చిన కళ తమన్నా ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ సందర్భంగా చెన్నై టైమ్స్ మేగజైన్ కోసం తమన్నా ఇప్పుడో ఫోటో షూట్ చేసింది. చేతిలో ఓ పళ్లెం.. అందులో పూజా సామాగ్రి.. ప్రసాదం.. ఓ ఇత్తడి దీపపు కుందె.. ఇవన్నీ చూడగానే తమన్నా క్లాసికల్ గా మారిపోయిందా అనిపించేస్తుంది. కానీ డ్రెసింగ్ విషయంలో తమ్మూ స్పెషాలిటీ చూపించేసింది. మెడలో నెక్లెస్.. భుజాల దగ్గర కట్స్ ఉన్న ఓ జాకెట్.. నడుము మాత్రం కనిపించేలా బాటమ్.. అన్నీ అదిరిపోయే కాంబినేషన్ అయినా.. అమ్మడి ఫేస్ లో నవ్వుకు మించి ఏదీ మెరవడం లేదు.

ఇప్పటికైతే కోలీవుడ్ లో విశాల్ తో కత్తి సాందాయ్ తో పాటు.. శింబుతో అంబానవాన్ అసరధావన్ అండగాధవన్ లో నటిస్తున్న మిల్కీ బ్యూటీ ఆశలన్నీ.. వచ్చే ఏడాది విడుదల కానున్న బాహుబలి ది కంక్లూజన్ పైనే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/