Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు లైనేస్తున్న మిల్కీ?

By:  Tupaki Desk   |   28 Feb 2019 1:30 AM GMT
జ‌క్క‌న్న‌కు లైనేస్తున్న మిల్కీ?
X
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ఉత్థాన‌ప‌త‌నాల గురించి తెలిసిందే. హిట్టు అన్న‌దే లేకుండా ఏళ్ల‌కు ఏళ్లు టాలీవుడ్ ని ఏలిన చ‌రిత్ర త‌న‌ది. `హ్యాపీడేస్` స‌క్సెస్ కిక్కులోనే ఐదేళ్లు గ‌డిచిపోతే, అటుపై వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో న‌టించి త‌న ప్రాప‌కాన్ని విజ‌య‌వంతంగానే సాగించింది. అప్పుడ‌ప్పుడు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌స్తే ఆ క్రెడిట్ త‌న ఖాతాలోకే వెళ్లి మ‌రో రెండేళ్లు మైలేజ్ వ‌చ్చేసేది. క‌నీసం బాలీవుడ్ అయినా క‌లిసొచ్చిందా అంటే అదీ అంద‌ని ద్రాక్షే అయ్యింది. అక్క‌డా న‌టించిన తొలి రెండు చిత్రాలు ఫ్లాపుల‌య్యాయి. హిమ్మ‌త్‌వాలా (2013), హ‌మ్ ష‌క‌ల్స్ (2014) చిత్రాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. దీంతో అక్క‌డి నుంచి త‌ట్టా బుట్టా స‌ర్ధుకుని ప్ర‌భుదేవా లాంటి స్టార్ తో క‌లిసి సౌత్ లో కొన్ని ప్ర‌యోగాలు చేసింది.

అయితే బాహుబ‌లి చిత్రంలో అవ‌కాశం ద‌క్క‌డం త‌న కెరీర్ కి ఓ మేలి మలుపు. కెరీర్ ప‌త‌నంలో ఉన్న‌ప్పుడు పిలిచి అవ‌కాశం ఇచ్చిన దేవుడు అయ్యాడు రాజ‌మౌళి. ఆ మాట‌నే త‌మ‌న్నా ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంది ఓ ఇంట‌ర్వ్యూలో. రాజ‌మౌళి స‌ర్ పిలిచి అవ‌కాశం ఇస్తానంటే ఏదో గెస్ట్ రోల్ అనుకున్నాను కానీ అంత గొప్ప సినిమాలో ఛాన్సిస్తున్నార‌ని ఆనాడు అనుకోలేదు అంటూ గ‌తంలోకి వెళ్లింది. అప్ప‌టికే కెరీర్ ఏమంత బాలేదు. హిందీ సినిమాలు పెద్ద‌ దెబ్బ కొట్టాయి. అలాంటి టైమ్ లో నాకు అంత బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు.. అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో నిలిచిపోయే అరుదైన చిత్రాన్ని తీస్తున్నార‌ని ఆనాడు భావించ‌లేద‌ని త‌మ‌న్నా అంది. రాజ‌మౌళి విజ‌న్.. క‌న్విక్ష‌న్ అంత గొప్ప‌వి. ఆయ‌న‌కు నా ధ‌న్య‌వాదాలు అని అంది.

వాస్త‌వానికి బాహుబ‌లి వ‌చ్చి వెళ్లి ఇన్నేళ్లు అయ్యాక త‌మ‌న్నా ఎందుకిలా మాట్లాడుతున్న‌ట్టు? అస‌లు మిల్కీ మైండ్ లో ఏం ఉంది? ఆర్.ఆర్.ఆర్ ఆలోచ‌న మెదులుతోందా? అందుకేనా ఇలా పొగిడేస్తోంది? అంటూ ఒక‌టే సందేహాలు నెల‌కొన్నాయి బోయ్స్ లో. అందులో అవంతిక‌గా అందంగా ఉన్నా.. ఆ రోల్ ఎందుకూ ప‌నికి రాలేద‌ని క్రిటిక్స్ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తిని మ‌రిచిందా? అయినా అలిగి రాజమౌళికి క‌నిపించ‌కుండా వెళ్లిపోయింద‌ని బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత ప్ర‌చారం సాగింది.. కానీ ఎందుక‌నో ఇప్పుడిలా మాట మారుస్తోంది?! ఇప్ప‌టివ‌ర‌కూ ఆర్‌.ఆర్.ఆర్ నాయిక‌ల్ని రాజ‌మౌళి ప్ర‌క‌టించ‌లేదు. త‌మ‌న్నాని ఖాయం చేసుకునే వీలుంది ఇంకా. అందుకేనా ఫిలింఫేర్ ఇంట‌ర్వ్యూలో ఇలా ఫీల‌ర్స్ వ‌దులింది?