Begin typing your search above and press return to search.
మీడియా అత్యుత్సాహం.. అంతా ఫేక్
By: Tupaki Desk | 1 Dec 2015 4:44 AM GMTమిల్కీవైట్ బ్యూటీ తమన్నా దశాబ్ధ కాలంగా తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్ హరోయిన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీడేస్ మూవీని ఇచ్చి, లైఫ్ నిచ్చింది తెలుగు సినీపరిశ్రమ కాబట్టి తన మొదటి ప్రయారిటీ టాలీవుడ్. ఆ తర్వాత ముంబై పరిశ్రమలో రాణించాలని ఎంతో తపించింది. కానీ అక్కడ బంతి తన కోర్టులో లేనేలేదు. కాబట్టి రెండో ఆప్షన్ గా తమిళ పరిశ్రమలో తన హవా చాటేందుకు ఎటెంప్ట్ చేస్తూనే ఉంది.
అయితే ఈ భామ లేటెస్టుగా ఓ వివాదంతో తమిళ మీడియాలో రచ్చకెక్కింది. రీసెంటుగానే చెన్నయ్ కి చెందిన ఓ సినీమ్యాగజైన్ తమన్నాఇంటర్వ్యూ అంటూ ఓ ఇంటర్వ్యూ పబ్లిష్ చేసింది. అందులో కోస్టార్ల గురించి, డబ్బు గురించి, ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడిందంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూ గురించి తనకేమీ తెలీదని, అది ఫేక్ ఇంటర్వ్యూ అంటూ షాకిచ్చింది తమన్నా. అసలు సదరు మ్యాగజైన్ కి నేను ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. అలాంటప్పుడు అదెలా వచ్చింది? అంటూ ప్రశ్నించింది.
నిజానికి సెలబ్రిటీల బిజీలైఫ్ వల్ల ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి ఈ రోజుల్లో లేనేలేదు. ట్విట్టర్ లు - ఫేస్ బుక్ లు - ఇన్ స్టాగ్రమ్ లు వంటి చోట్ల వీళ్లు చేసే కామెంట్లు ఏం ఉన్నాయో .. వాటన్నిటినీ గుదిగుచ్చి ఇలా ఇంటర్వ్యూలుగా రాసేందుకు ప్రయత్నిస్తున్నారు ఎడిటర్స్. పైగా ఇటీవలి కాలంలో తమన్నా తెలుగు మీడియాలో మాట్లాడిన సంగతుల్ని సదరు మ్యాగజైన్ ఆ ఇంటర్వ్యూలో ప్రస్థావించింది. ఇప్పుడర్థమైందా?