Begin typing your search above and press return to search.

విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ త‌మ‌న్నా ఫ్యాన్స్ ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 AM GMT
విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ త‌మ‌న్నా ఫ్యాన్స్ ఇష్టం లేదా?
X
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా - న‌టుడు విజ‌య్ వ‌ర్మ మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అని కొంత కాలంగా మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు క్లోజ్ గా మూవ్ అవ్వ‌డం....చిట్ చాట్...ముంబైలో షికార్లు లాంటి స‌న్నివేశాలు ఈ సందేహాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచాయి. ఈ మ‌ధ్య‌నే న్యూ ఇయర్ వేడుకలను సైతం గోవాలో జంటగా సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఇద్ద‌రి మ‌ధ్య స్నేహాన్నిమించిన బ‌ల‌మైన బంధం ముడిప‌డింద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు ఒక్కసారిగా గుప్పుమ‌న్నాయి. అదే పార్టీలో వీరిద్దరూ ఇద్ద‌రు ముద్దు పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవ‌రి శైలిలో వారు స్పందించారు. ఈ ఘటన తర్వాత తొలిసారి జంట‌గా ముంబయి విమానాశ్రయంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

గోవా వేడుక‌లు అనంత‌రం ఇలా ముంబై మీడియాకి చిక్క‌డంతో దాదాపు విష‌యం క‌న్ప‌మ్ చేసుకుంటున్నారంతా. మిల్కీ మ‌హా యాయ లేడీ అంటూ అభిమానులు గుసుగుస‌లాడుకుంటున్నారు. ఓవైపు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. న‌చ్చిన వాడు దొరికితే నేను రెడీ అంటూనే....విజ‌య్ తో ఈ ల‌వ్వాయ‌ణం ఏంటి? అంటూ నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు.


ఈ వీడియోలో తమన్నా నలుపు రంగు దుస్తుల్లో మెరవగా.. విజయ్ వైట్ టీషర్ట్ డెనిమ్ జీన్స్‌లో దర్శనమిచ్చారు. ఇద్ద‌రు ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాన్ని ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయ‌డం..అది వైర‌ల్ గా మార‌డం తెలిసిందే.
వీరి రిలేషన్‌షిప్ గురించి తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను అని ఓ యూజర్ పోస్ట్ పెట్టగా.. చూసేందుకు వీరి జోడీ చాలా బాగుందని మరొకరు స్పందించారు.

ఇద్దరూ ఎంతో అందంగా ఉన్నారని మరొకరు పోస్ట్ పెట్టారు. మొత్తానికి ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఎలాంటిద‌న్న‌ది అస‌లొళ్లు క‌న్ప‌మ్ చేయ‌క‌పోయినా కొస‌రోళ్లు మాత్రం ఫిక్స్ చేసేసారు. అయితే మ‌రికొంత మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. త‌మ‌న్నా రేంజ్ హీరోయిన్ ఓ సాధార‌ణ న‌టుడ్ని ప్రేమించ‌డం ఏంటిని క్వ‌శ్చ‌న్స్ రెయిజ్ చేస్తున్నారు కొంద‌రు. ప్రేమ‌కి కొల‌మానం ఏంటిని ప్ర‌తిగా కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

ఇక త‌మ‌న్నా కెరీర్ కూడా చ‌ర‌మాంకానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ లీగ్ నుంచి ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం చిన్న సినిమాలు చేస్తుంది. న‌టిగా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న‌తం కాలం అమ్మ‌డు కేవ‌లం వృత్తిపైనే దృష్టి పెట్టి ప‌నిచేసింది. అందుకే అంత పెద్ద స‌క్సెస్ అయింది. ఈ విష‌యంలో త‌మ‌న్నా న‌వ నాయిక‌ల‌కు ఆద‌ర్శమ‌నే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.