Begin typing your search above and press return to search.

బెల్లంకొండకు అడిక్ట్ అయిపోయిన తమ్మూ

By:  Tupaki Desk   |   2 Feb 2016 10:30 PM GMT
బెల్లంకొండకు అడిక్ట్ అయిపోయిన తమ్మూ
X
నా ఇంటి పేరు సిల్కు అంటూ ‘అల్లుడు శీను’ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి వీర లెవెల్లో స్టెప్పులేసింది తమన్నా. ఆ తర్వాత వేరే సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినా అంగీకరించని తమ్మూ.. మళ్లీ ‘స్పీడున్నోడు’ కోసం మరోసారి శీనుతో బ్యాచిలర్ బాబూ అనే పాటలో డ్యాన్స్ చేసింది. ఇప్పుడిక ఏకంగా శ్రీనివాస్ సరసన హీరోయిన్ గానే నటించబోతోందట తమ్మూ.

ఈ శుక్రవారం ‘స్పీడున్నోడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. తన తర్వాతి సినిమా ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని.. అందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని.. ఇంతకుమించి వివరాలేమీ ఇప్పుడు వెల్లడించలేనని శ్రీనివాస్ తెలిపాడు. ‘అల్లుడు శీను’లో కేవలం ఐటెం సాంగ్ కే 70-80 లక్షలు వసూలు చేసిన తమ్మూ.. పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎంత రాబడుతుందన్నది ఆసక్తికరం.

శ్రీనివాస్ తర్వాతి సినిమా బోయపాటి శ్రీనుతో ఉండొచ్చని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘అల్లుడు శీను’ తర్వాతే సినిమా తెరకెక్కాల్సింది. కానీ అప్పట్లో బోయపాటి కోరుకున్న బడ్జెట్ ఇవ్వకపోవడంతో అతను ఆ ప్రాజెక్టను పక్కనబెట్టేశాడు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ బోయపాటి కోరుకున్నట్లే భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కబోతోంది. బాలయ్య వందో సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తాడా లేదా అన్నదాన్ని బట్టి బెల్లకొండ ప్రాజెక్టు సంగతి తేలుతుంది.