Begin typing your search above and press return to search.
అంత గట్టిగా హగ్గివ్వాలా డార్లింగ్!?
By: Tupaki Desk | 20 Nov 2018 5:11 PM GMTప్రేమ తన్నుకొచ్చినా.. కోపం ఎగసి పడినా ఆపలేం! ఆ రెండు సందర్భాల్లో అమ్మాయిలు అయితే మరీ వీక్. వెంటనే బరస్ట్ అయిపోతారు. అవతలివాళ్లపై ఎమోషన్ అయిపోతారు. ఇదిగో ఇక్కడ అదే సన్నివేశం ఎదురైంది. అయితే ఆ సీన్ కి వేదిక అయ్యింది.. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులతో రద్దీగా ఉండే ముంబై ఎయిర్ పోర్ట్ కావడం విశేషం.
ఒక్క క్షణం ఆ సీన్ చూసి జనం ఫక్కున నవ్వేసుకున్నారు. అరే ఏంటి ఈ పిచ్చి.. ఎంత ప్రేమ పిచ్చి పరాకాష్టకు చేరితే మాత్రం మరీ ఇంత ఘాటైన హగ్గులివ్వాలా? అంటూ తెగ ఇదైపోయారట జనం. ఇంతకీ ఆ హగ్గు ఎవరు ఎవరికి ఇచ్చారు? అంటే విడిగా చెప్పాల్సిన పనేలేదు. ఈ ఫోటో చూస్తేనే అర్థమైపోతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా - శ్రుతిహాసన్ ఇలా ఒకరినొకరు ఎదురుపడగానే ఘాటుగా హగ్ చేసుకున్నారు. అది కూడా సినిమాలో స్లోమోషన్ షాట్ లా ఆ ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో పరుగు పరుగున వెళ్లి ఒకరినొకరు హగ్ చేసుకున్నారట. దీంతో చూసినవాళ్లంతా అవాక్కయ్యారని చెబుతున్నారు.
అసలే మాయదారి బిజీ లైఫ్. ఆపై క్షణం తీరికైనా లేదాయె. కనీసం ఫోన్లు చేసుకుని మాట్లాడుకునేందుకైనా టైమ్ లేదు. అందుకే రాక రాక ఒక్క ఛాన్స్ వస్తే ఆ క్షణాన్ని ఏమాత్రం వదులుకోవడం ఇష్టం లేక ఈ అమ్మణ్ణులిద్దరూ ఒకరినొకరు అలా ఘాటుగా హగ్ చేసుకున్నారట. ఇక తమన్నాని కలిస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేను అంటూ శ్రుతి ఉబ్బిపోయింది. ఇక తమన్నా అయితే .. పోయెట్రీనే చెప్పింది. నీకు ఇష్టమైన వారిని కలిసినప్పుడు దూరం - సమయం - ప్రదేశం అవేమి పట్టించుకోం. అలాంటి వారిని ఎయిర్‌పోర్టులో కలుసుకోవడం సరైనదే. శృతిహాసన్ ను కలుసుకోవడంతో ఈ రోజు ఎంతో సరదాగా గడిచిపోయింది! అంటూ సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ ఫోటోతో సహా వివరాలందించింది. అయితే తమన్నా ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా - శ్రుతిహాసన్ ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అయితే స్నేహితురాళ్లు కాబట్టి అలా చాలాకాలానికి కలవడం వల్ల అంత ఎమోషన్ అయ్యారన్నమాట!