Begin typing your search above and press return to search.

ప‌చ్చ బికినీలో ప‌చ్చ బొట్టేసినా..

By:  Tupaki Desk   |   18 Nov 2019 3:51 PM GMT
ప‌చ్చ బికినీలో ప‌చ్చ బొట్టేసినా..
X
ఊహించ‌నిదేదో క‌ళ్ల ముందే ఊరిస్తే... అది నెవ్వ‌ర్ బిఫోర్ అనిపిస్తే అలాంటి గ‌మ్మ‌త్త‌యినదేదో బ్ల‌ర్ అవ్వ‌కముందే క్యాచ్ చేసేందుకు క‌ళ్లు ఆత్ర‌ప‌డ‌తాయి. ఇదిగో అలాంటి గ‌మ్మ‌త్త‌యిన అనుభ‌వ‌మే మిగిలింది `యాక్ష‌న్` సినిమా చూసిన కుర్రాళ్ల‌కు. బాహుబ‌లి చిత్రంలో ప‌చ్చ బొట్టేసినా.. అంటూ అవంతిక‌గా అద్భుత సౌంద‌ర్య‌ ధ‌ర‌హాసంతో అల‌రించిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంత‌కుమించి యాక్ష‌న్‌ సినిమాలో నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత‌గా చెల‌రేగిపోయింది. అస‌లు తెర‌పై క‌నిపిస్తున్న‌ది మిల్కీ బ్యూటీయేనా? లేక హాలీవుడ్ నుంచి దిగి వ‌చ్చిన పాప్ పాల పిట్ట‌నా? అన్నంత‌గా మైమ‌రిపించింది. సినిమా ఆద్యంతం విశాల్ కి ధీటైన స్టంట్స్ తో ఆక‌ట్టుకున్న మిల్కీ అంత‌కుమించిన కొత్త కోణాలెన్నో చూపించింది. అందునా పాట‌ల్లో అందాల ఆర‌బోతతో పిచ్చెక్కించింది.

ముఖ్యంగా విశాల్ తో డ్రీమ్ సాంగ్ లో అయితే మిల్కీ అందం వ‌ర్ణించ‌న‌ల‌వి కాదు. ఆ పాట ఆద్యంతం ప‌చ్చ బికినీలో మిల్కీ ఒంపుసొంపులు .. మేనివిరుపుల్లో థై సొగ‌సు క‌నువిందు చేసింది. పాల నురుగు దేహ‌శిరుల‌పై ప‌చ్చ‌ని ఆ బికినీ ప‌ర్ఫెక్ట్ గా సెట్ట‌యి ఎంతో అందంగా ఎలివేట్ చేసింది. అస‌లు అది నేనేనా? అని త‌మ‌న్నాయే కంగారు ప‌డింద‌ట‌. ఆ సంగ‌తిని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించడం షాకిచ్చింది. అంతెందుకు ఇదే సినిమాలో త‌మ‌న్నాతో పోటీప‌డుతూ అద‌రగొట్టేసిన ఆకాంక్ష పూరి సైతం బికినీ బీచ్ లో బోట్ షికారులో అదిరిపోయే ట్రీటిచ్చింది. అయితే త‌మ‌న్నా ఫోటోలు అంత‌ర్జాలంలోకి రాగానే ఇది త‌మ‌న్నా కాదు.. ఆకాంక్ష పూరి అని భావించారు కొంద‌రైతే.

ఇటీవ‌లి కాలంలో స్కిన్ షో విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మిల్కీబ్యూటీ ఏమాత్రం అడ్డు చెప్ప‌బోవ‌డం లేదు. పెరుగుతున్న పోటీకి త‌గ్గ‌ట్టే ఓపెన్ గా ఉంటోంది. యాక్ష‌న్ తోనే ఈ స్పీడ్ త‌గ్గిపోయే ఆస్కారం లేదు. మునుముందు త‌మ‌న్నా ట్రీట్ డ‌బుల్ ట్రిపుల్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ‌న్నా న‌టించిన సినిమాల్లోనే నెవ్వ‌ర్ బిఫోర్ సెక్సీ లుక్ ఈ పచ్చ బికినీయేన‌ని అంగీక‌రించి తీరాల్సిందే.