Begin typing your search above and press return to search.

మిల్కీ.. ఏందీ సిగ్గు సింతకాయ్‌??

By:  Tupaki Desk   |   4 Dec 2015 6:39 AM GMT
మిల్కీ.. ఏందీ సిగ్గు సింతకాయ్‌??
X
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ యూట‌ర్న్ తీసుకుని స్కైలోకి వెళ్లిపోతున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి మూవీలో అవంతిక‌గా డీగ్లామ‌ర‌స్ రోల్‌లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం నాగార్జున‌- కార్తీ హీరోలుగా తెర‌కెక్కుతున్న‌ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరిలో న‌టిస్తోంది. ఈనెల 10న‌ ర‌వితేజ స‌ర‌స‌న న‌టించిన బెంగాల్ టైగ‌ర్ రిలీజ్‌కి వ‌స్తోంది.

ఒక ప్రాజెక్టు వెంట ఒక‌టిగా సంత‌కాలు చేస్తూనే ఉంది. అయితే ద‌శాబ్ధ కాలంగా సినీప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్న త‌మ‌న్నా అస‌లు న‌టి అయ్యి ఉండేదానిని కాద‌ని అంటోంది. ఫేట్ ఇలా నిర్ణ‌యించి ఉంది. అందుకే న‌టిస్తున్నాన‌ని చెప్పింది. నాక‌స‌లే సిగ్గు ఎక్కువ‌. కెమెరా ముందుకు రావాలంటే భ‌యం. కానీ అన్నిటినీ జ‌యించాను. చిత్ర ప‌రిశ్ర‌మ నాకు వ‌రం లాంటిది. ఇక్క‌డికి వ‌చ్చాక బోలెడ‌న్ని నేర్చుకున్నా. ఇంకా చెప్పాలంటే చ‌క్క‌ని గుణ‌పాఠాలెన్నో ప‌రిశ్ర‌మ‌లోనే నేర్చుకున్నా అని అంది. ఈ అమ్మ‌డు ఏం మాట్లాడినా ఇటీవ‌లి కాలంలో అందులో వేదాంతం క‌నిపిస్తోంది.

అనుభ‌వాల‌తో కూడిన జ్ఞానంతో ఇలా మాట్లాడుతోందా? లేక కొన్నిటిని త‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఇలా చెబుతోందా? అన్న‌ది అవ‌త‌లి వాళ్ల‌కు అర్థం కావ‌డం లేదు మ‌రి. అసలు తమన్నాకు సిగ్గంటే.. ఆ బెంగాళ్‌ టైగర్‌ లో వానపాట చూస్తుంటే.. క్యాన్‌ వుయ్‌ బిలీవ్‌ దిస్‌ సిగ్గు సింతకాయ్‌??