Begin typing your search above and press return to search.
మహేష్ సరసన ఆగడు భామ?
By: Tupaki Desk | 9 Sep 2019 7:45 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక కర్నూల్ కొండారెడ్డి బురుజుని పోలిన సెట్ లో ఏకధాటిగా కానిచ్చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ఇంట్రో సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సెట్ చేసినట్టుగా తాజా అప్ డేట్. ఆ మేరకు అడ్వాన్స్ ఇచ్చేశారట.
నిజానికి ఇందులో మహేష్ సెంటిమెంట్ గా భావించే లక్కీ చార్మ్ మీనాక్షి దీక్షిత్ ని తీసుకోవాలని అనుకున్నారట. కాని అనిల్ రావిపూడి ఏమంత ఆసక్తి చూపకపోవడంతో నిర్ణయం మార్చుకుని తమన్నా వైపు ఆప్షన్ వెళ్లినట్టు చెబుతున్నారు. కేవలం ఇంట్రో సాంగ్ వరకే పరిమితం కాబట్టి తనైతే సరిపోతుందని భావించారట. గతంలో మహేష్ తో తమన్నా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఫుల్ లెంత్ రోల్ లో ఆగడు చేసింది. కాని అది డిజాస్టర్ కావడంతో ఆ కాంబో మళ్ళి రిపీట్ కాలేదు.
తమన్నా ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఎఫ్2తో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో పడగా వచ్చే నెల చిరుతో ఫస్ట్ టైం చేసిన సైరా నరసింహరెడ్డి మరో పెద్ద బ్రేక్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉంది. ఇప్పుడీ సాంగ్ న్యూస్ కూడా నిజమే అయితే మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. మెయిన్ హీరొయిన్ రష్మిక మందన్ననే అయినప్పటికీ సాంగ్ కనక క్లిక్ అయితే తనకూ పేరు వస్తుంది,. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది.