Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: జిల్ జిల్ గా మిల్కీ

By:  Tupaki Desk   |   22 Nov 2018 10:16 AM GMT
ఫోటో స్టొరీ: జిల్ జిల్ గా మిల్కీ
X
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ప్రస్తుతం అంత పీక్స్ లో లేదు కాని.. చేతిలో మంచి ప్రాజెక్టులు లేవని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 'ఎఫ్2' లాంటి క్రేజీ మల్టిస్టారర్ లో తమన్నా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ సూపర్ హిట్ 'క్వీన్' రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' లో లీడ్ రోల్. ఇక 'సైరా' లోనూ 'ఎన్టీఆర్ కథానాయకుడు' లోనూ ముఖ్యమైన పాత్రలే చేస్తోంది. ఇవి కాకుండా తమిళంలో రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి.

ఈ సినిమాలు రిలీజయ్యేందుకు ఇంకా సమయం ఉంది గానీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'. బాలీవుడ్ దర్శకుడు 'ఫనా' ఫేమ్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్.. నవదీప్ లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ వీలైనంతగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈమధ్యే 'నెక్స్ట్ ఏంటి' టీమ్ రానా నిర్వహిస్తున్న నెం. 1 యారి షో లో కూడా పాల్గొన్నారు.

ఆ కార్యక్రమానికి హాజరైన కాస్ట్యూమ్ లోనే ఫోటో షూట్ చేసింది. తన ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను షేర్ చేసింది. వైట్ టీ-షర్ట్.. వైట్ మిడ్డీ తళతళా మెరిసిపోయింది. అసలే మిల్కీ వైట్ బ్యూటీ పైగా.. వైట్ డ్రెస్. ఆ డ్రెస్ పై లిప్స్ బొమ్మలు ఎందుకో తెలీదు గానీ ఒక కూల్ స్టెప్ వేస్తూ పోజిచ్చింది. ఈ ఫోటోకు ఆమె ట్విట్టర్ లో పెట్టిన క్యాప్షన్ "ఒక స్ట్రాంగ్ ఉమన్ కు ఛాలెంజ్ ఎదురైతే దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి కన్ను కొడుతుంది- జీనా". అంటే దానర్థం సమస్యలకు భయపడేదాన్ని కాదనేగా!