Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో 'నెపోటిజం' పై మిల్కీ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు...!
By: Tupaki Desk | 2 July 2020 5:17 PM GMTసినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా 'నెపోటిజం'పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు.. ఇప్పుడు మిగతా అన్ని ఇండస్ట్రీలలో కూడా దీనిపై డిస్కషన్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారు అని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇటీవల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా 'నెపోటిజం'పై కామెంట్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను బయట పెడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీషు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ తమన్నా నెపోటిజం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తమన్నా మాట్లాడుతూ.. నేను సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను. మొదట నేను తమిళ తెలుగు సినిమాలు చేసినప్పుడు నాకు ఆ భాషలు తెలియదు.. అక్కడ నాకు పరిచయాలు కూడా లేవు. అయినా నాకు ఆ ఇండస్ట్రీలలో ఆఫర్స్ వచ్చాయి. నా హార్డ్ వర్క్ ని టాలెంట్ ని చూసి నాకు అవకాశాలు ఇచ్చారు. నేను వాటిని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నా. ఇక మా ఫ్యామిలీలో అందరూ వైద్య వృత్తిలో ఉన్నారు. ఒకవేళ నేను కూడా డాక్టర్ అయ్యుంటే నాకు వాళ్లు సలహాలు ఇచ్చేవారు. కానీ నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒకవేళ భవిష్యత్ లో నా పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తానంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. అందులో తప్పేమీ లేదని అనుకుంటున్నా. నా హిట్స్ ప్లాప్స్ కి విధిరాతే కారణమని నేను బిలీవ్ చేస్తాను. నెపోటిజం అనేది ప్రతీ రంగంలో కామన్ గా ఉంటుంది. అయితే అది ఒకరికి సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ని డిసైడ్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం. ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ రెండింటిని బ్యాలన్స్ గా చూసినప్పుడే మంచి నటులు అవుతారని చెప్పుకొచ్చారు.