Begin typing your search above and press return to search.

తమన్నా.. మళ్ళీ సేమ్‌ ఐటెం!!

By:  Tupaki Desk   |   30 Oct 2015 5:00 PM IST
తమన్నా.. మళ్ళీ సేమ్‌ ఐటెం!!
X
మళ్ళీ మళ్ళీ ఒకే పని చేయాలంటే.. ఖచ్చితంగా మన హీరోయిన్లకు అయితే ఫుల్‌ గా పేమెంట్‌ అదిరిపోవాలి.. లేకపోతే అవతల ఆఫర్‌ ఇచ్చింది పెద్ద స్టార్‌ హీరో అయినా అయ్యుండాలి. అప్పుడు మన హీరోయిన్లు చేసిన పనులే మళ్ళి చేస్తారు.. వేసిన రోల్స్‌ మళ్ళీ వేస్తారు.. హద్దు దాటిన గ్లామర్‌ ను మళ్ళీ ప్రదర్శిస్తారు. మీకు డౌటుంటో ఓసారి మిల్కీ బ్యూటీని అడగండి మరి.

ఇప్పటివరకు కేవలం హీరోయిన్‌ గానే అన ఒంపుసొంపైన లావణ్యాలను ఓ రేంజులో తడపి ఆరబోసిన తమన్నా.. ప్రత్యేకంగా ఐటెం గాళ్‌ గా ఇప్పుడు ఆరబోయాల్సింది అంటూ ఏమీ లేదు. అయినాసరే అమ్మడు తను కూడా కెరియర్‌ లో ఒక ఐటెం చేశాను అనిపించుకోవడానికి.. ఏకంగా కొత్త కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్‌ తో ఒక నెంబర్‌ చేసింది. నా ఇంటి పేరు సిల్కు అంటూ సాగే ఈ ఐటెంలో తమన్నా మెరుపులు పెద్దగా క్లిక్కవకపోయినా కూడా.. ఆమె గ్లామర్‌ సాంగు సినిమాకు మాంచి ఎసెట్‌ అయ్యిందనే అందరి బిలీఫ్‌.

అందుకే ఇప్పుడు తమన్నా ఉంటే తనకు లక్‌ తప్పనిసరిగా వస్తుందని అనుకున్నాడేమో కాని.. వెంటనే మన హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌.. తాను దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుతో చేస్తున్న సుందరపాండియన్‌ అనే తమిళ సినిమా తెలుగు రీమేక్‌ కోసం మరసారి తమన్నాతో ఐటెం చేయించడానికి రంగం సిద్దం చేశారట. ఈసారి తమన్నాకు ఏకంగా 80 లక్షలు ఇచ్చి మరీ ఆ పాటకు డ్యాన్సు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సొనారికా బడోరియా హీరోయిన్‌ గా నటిస్తోంది.