Begin typing your search above and press return to search.

ఇంతందంగా ఉన్నావే.. మిల్కీ నువ్వు!!

By:  Tupaki Desk   |   18 May 2016 4:29 AM GMT
ఇంతందంగా ఉన్నావే.. మిల్కీ నువ్వు!!
X
పై ఫోటోలో మిల్కీ బ్యూటీ తమన్నాని చూశాక.. అభిమానులు ఎవరైనా సరే ఇలా 'ఇంతందంగా ఉన్నావే..' అని పాడుకోవాల్సిందే. అసలు వైట్ బ్యూటీ. దానికి తోడు ప్రత్యేకంగా తీసిన ఫోటో షూట్. పైగా హై ప్రొఫెషనల్ కెమేరా మ్యాన్ తో చేయించిన ఫోటో షూట్. వీటన్నిటితో పాటు ఉల్లిపొర లాంటి చీరకట్టు, అద్భుతమైన స్టైలింగ్.. మిలమిల్లాడిపోతున్న తమన్నా.. మొత్తం కలిసి మిల్కీని చూస్తుంటే మైమరిచిపోవాల్సిందే.

సినిమాల్లో అంటే రకరకాల సీన్స్ కోసం పలు గెటప్ లలో కనిపించాల్సి వస్తుంది. కానీ యాడ్స్ తో ఆ బాధ లేదు. పక్కాగా తమ అందం మరింతగా ఇనుమడింపచేసేలా కనిపించచ్చు. పైగా అదో జ్యూవెలరీ కంపెనీ యాడ్ అయితే.. ఇక బంగారంతో పోటీ పడిపోయేలా అందాలను ప్రదర్శించచ్చు. ఇక్కడ మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తోంది కూడా అదే.

బంగారం రంగులోని ట్రాన్స్ పరెంట్ శారీ ధరించి, ఒంటినిండా డిజైనర్ వేర్ ఆర్నమెంట్స్ తో తమన్నాని చూస్తుంటే.. ఆ గోల్డ్ కంటే తమన్నానే తళతళలాడుతోంది అనిపించక మానదు. ఏమైనా అందగత్తె ఎన్ని షోకులు పోయినా.. అందంగానే ఉంటుంది కదా.