Begin typing your search above and press return to search.
ఆకుపచ్చలో మిల్కీ వైట్ బ్యూటీ తళుకుబెళుకులు
By: Tupaki Desk | 5 Sep 2021 3:30 AM GMTమిల్కీవైట్ బ్యూటీ తమన్నా రెండు దశాబ్ధాల కెరీర్ కి చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నాయికల్లో సుదీర్ఘ కాలం కెరీర్ బండిని విజయవంతంగా నడిపించిన భామగా తనకంటూ ఓ రెస్పెక్ట్ ఉంది. ఇటు సౌత్ అటు నార్త్ రెండుచోట్లా ఈ ముంబై బ్యూటీకి బలమైన అభిమానులు ఉన్నారు. దశాబ్ధం పైగా అగ్ర హీరోల సరసన నటించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకుంది.
బాహుబలి (2015) తర్వాత తమన్నాకి జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగింది. సైరా లాంటి పాన్ ఇండియా చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది. నవంబరు (2021) క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో మరోసారి అభిమానుల్లోకి దూసుకెళ్లింది. పెద్ద స్క్రీన్ బుల్లితెర ఓటీటీ అంటూ అన్నిటా తానున్నానని దూసుకెళుతోంది. తమన్నా అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వంటల కార్యక్రమం మాస్టర్ చెఫ్ లో తన భారీ ప్రవేశంతో ప్రేక్షకులను అలరిస్తోంది.
తమన్నా ఇటీవల శుభికా ఫ్యాషన్స్ తో అభిమానుల మనుసు దోచింది. సేజ్ గ్రీన్ ఫ్యూజన్ దుస్తులను ధరించి స్నాప్ లను పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. గ్రీన్ లో స్పెషల్ లుక్ తో మెరిసిపోయిన తమన్నా సిల్క్ ప్యాంటులో బెలూన్ స్లీవ్ లతో కనిపించింది. ఆకుపచ్చ బ్లౌజ్ అలంకరణలు కూడా ఆకట్టుకున్నాయి. గ్రీన్ ఫ్యూజన్ సెట్ ధర రూ .56 వేలుగా ఉంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే .. తమన్నా భాటియా తదుపరి అంధాధున్ తెలుగు రీమేక్ మాస్ట్రో లో నితిన్ సరసన కనిపించనుంది. ఆమె టబు పాత్రలో కనిపించనుంది. నభా నటేష్ ఇందులో రాధికా ఆప్టే పాత్రను పోషిస్తుంది. అలాగే ఎఫ్ 2 సీక్వెల్ F3లోనూ నటిస్తోంది. ఎఫ్ 3 లో వరుణ్ తేజ్- వెంకటేష్ దగ్గుబాటి -మెహరీన్ పిర్జాదా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ చిత్రం `లవ్ మాక్ టైల్` తెలుగు రీమేక్ లో సత్య దేవ్ తో పాటు నటిస్తుంది. దీనికి గుర్తుందా శీతాకాలం అనే టైటిల ని ప్రకటించారు. చరణ్- శంకర్ కాంబినేషన్ మూవీ ఆర్సీ 15లో తమన్నా విలన్ గా నటించనుందని కథనాలొస్తున్నాయి.